చిట్యాల (నకిరేకల్): చిట్యాలలో ఈ నెల 15వ తేదీన జరిగిన ఇంటర్ విద్యార్థి గుండాల సాయికుమార్(17) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్డుకు రిమాండ్ చేసినట్లు చిట్యాల సీఐ పాండురంగారెడ్డి తెలిపారు. చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు.
గంజాయి మత్తులో..
హత్యకు గురయిన సాయికుమార్ తండ్రి నిర్వహిస్తున్న సిమెంట్ దుకాణం షెడ్డు పక్కనే ఫీట్ల రాజు ఆలియాస్ గాలిపంపు రాజు వాహనాల టైర్లకు గాలిపంపు కొట్టును నిర్వహిస్తున్నాడు. అయితే హత్య జరిగిన రోజు (ఈ నెల 15వ తేదీ) రాత్రి మృతుడు సాయికుమార్, ఫీట్ల రాజులు సిమెంటు దుకాణం షెడ్డు నిర్వహిస్తున్న ప్రాంతం సమీపంలో మద్యం తాగి విందు చేసుకున్నారు. ఇదే సమయంలో చిట్యాలకు చెందిన మేడి నర్సింహ, బండ్ల రాజు అనే యువకులు గంజాయి తాగేందుకు వీరు విందు చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చారు. అనంతరం వీరిద్దరితో కలిసి రాజు గంజాయిని తాగాడు. దీంతో రాజు మత్తులోకి వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ అక్కడే ఉన్న మేడి నర్సింహకు చెందిన బైక్‌ను తీసుకుని మత్తులోకి జారుకుంటున్న రాజును బైక్‌పై కూర్చోబెట్టుకుని రాజు ఇంటి వద్దకు తీసుకువెళ్లాడు. రాజు మత్తులో ఉండడంతో గమనించిన సాయికుమార్ రాజు భార్యపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె అతడిని నేట్టేసి తిట్టడంతో సాయికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఇనుప రాడ్డుతో మోది..
అనంతరం మత్తులో ఉన్న రాజుకు జ రిగిన విషయాన్ని భార్య తెలిపింది. రాజు వెంటనే సిమెంటు దుకాణం షె డ్డులో నిద్రిస్తున్న సాయికుమార్ వద్ద కు వెళ్లి వాహనాల టైర్‌ను తీసేందుకు ఉపయోగించే ఇనుప రాడ్డుతో మెడపై బలంగా మోదాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న సాయికుమార్ నిద్రలో నే అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీసులు తమదైన రీతిలో రాజును విచారించగా తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రాజుపై కేసు నమోదు చేసి శుక్రవారం రామన్నపేట కోర్డుకు రిమాండ్ చేసినట్లు సీ ఐ తెలిపారు. ఈ కేసు ఛేదించేం దుకు కానిస్టేబుళ్లు గిరి, విష్ణు, రామకృష్ణలు చేసిన కృషిని సీఐ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సూదిని దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment