నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల నుంచి తీవ్రమైన ఆరోపణలు రావడం, నిరసనలు తలెత్తడంతో జిల్లా అధికారులు వీటిపై చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ నడుంబిగించింది. అనుమతి లేని 17 పాఠశాలలపై నోటీసులు జారీచేసి సీజ్ చేయాలని ఇదివరకే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని వాసాచారి ఆదేశించారు. అంతేగాక ఎంఈఓ లు ఇచ్చిన నివేదికలపై డీఈఓ స్వ యంగా తనిఖీలు చేస్తున్నారు.
శుక్రవారం ఆర్మూర్ మండలం ఆలూరు, ఇతర నాలుగు గ్రామాల్లో డీఈఓ పాఠశాలలను తనిఖీ చేశా రు. ఆర్మూర్ పట్టణంలో డీఈఓ తనిఖీలు చేయగా, మూడు పాఠశాలలకు గుర్తింపు లేద ని తేలింది. కానీ ఇదివరకే ఆర్మూర్ మండలంలో అనుమతిలేని పాఠశాలలు లేవని ఎంఈఓ వి ద్యాశాఖ అధికారికి నివేదిక ఇచ్చారు. కానీ డీఈఓ పరిశీలనలో అనుమతిలేని పాఠశాలలు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్థానిక విద్యాధికారి బాగోతం బ యటపడింది. తప్పుడు నివేదిక సమర్పించినందుకు ఎంఈఓపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసా రి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని హెచ్చరించా రు. ఆర్మూర్ మండలంలో పూర్తిస్థాయి పరిశీలన జరి పి, అనుమతి లేని పాఠశాలల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఆరాతీసిన ఇంటెలిజెన్స్..
జిల్లాలో 53 పాఠశాలలకు ఎలాంటి గుర్తింపు లేదని ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు డీఈఓకు నివేదిక ఇచ్చారు. జిల్లాలో కొన్నేళ్లుగా పలు పాఠశాలలలు అనుమతి లే కుండా కొనసాగుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా 53 పాఠశాలలను పూర్తిస్థాయి పరిశీలన జరిపి, అనుమతి ఉందా లేదా అనేది తేల్చి నివేదిక ఇవ్వాలని సంబంధిత ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. ఈ నివేదిక అందగానే అనుమతి లేని పాఠశాలలను మూసివేయనున్నట్లు డీఈఓ తెలిపారు. అనుమతి లేకుండా కొనసాగే పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు.
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పాఠశాలలు
అనుమతి లేని పాఠశాలలను మూసివేయాలని రెం డు రోజుల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ జిల్లాకేంద్రంలో ఏడు పాఠశాలలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎం ఈఓకు ఆదేశాలు జారీ చేసినా, ఇటువైపు వెళ్లకపోవ డం గమనార్హం. గుర్తింపులేకున్నా పాఠశాలల్లో వి ద్యాబోధన చేపడుతున్నారు. ఇంతేగాక మరో 12 పాఠశాలలు ఎలాంటి గుర్తింపు లేకుండా కొనసాగుతున్నప్పటికీ వీటిని ఆ జాబితాలో మాత్రం చేర్చలేదు.
అనుమతి లేని స్కూళ్లపై చర్యలు
Published Mon, Jul 7 2014 2:03 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement