గ్రామీణ వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు
- సీఎం కేసీఆర్ హామీ
- ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధే ధ్యేయమని వెల్లడి
- ఛాతీ వైద్యశాల తరలింపునకు మద్దతిస్తామన్న డాక్టర్ల సంఘాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు అదనపు ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇచ్చే యోచనలో ప్రభుత్వముం దని సీఎం కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీతోపాటు ఇతర అంశాలపై చొరవ తీసుకోవాలని కోరుతూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీరేశం, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు బుధవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
తెలంగాణలో ప్రభుత్వ వైద్యశాలల అభివద్ధి కోసం ప్రభుత్వ చొరవ పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నగర, పట్టణ ప్రాంతాల్లోని వారితో పోలిస్తే తక్కువ హెచ్‌ఆర్‌ఏ వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంటుందని హామీఇచ్చారు.
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు వైద్యులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల నుంచి ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రుల వరకు అన్నింటినీ మెరుగు పరచాల నేదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. కార్పొరేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ వైద్యరంగం మెరుగుకు త్వరలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తానని సీఎం ప్రకటించారు.
ఛాతీ ఆస్పత్రి తరలింపునకు మద్దతు
సీఎం కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్‌లు విలేకరులతో మాట్లాడారు. ఛాతి ఆసుపత్రిని నగర శివారు వికారాబాద్‌కు తరలించడంతో అక్కడున్న మంచి వాతావరణం వల్ల రోగులు త్వరగా కోలుకోనే వీలుం టుందని చెప్పారు. ఛాతి వైద్యశాలను తరలించే విషయంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సంఘం అధ్యక్షుడు డాక్టర్ వీరేశం స్పష్టం చేశారు. అక్కడికి త్వరగా చేరుకునేందుకు సరైన రోడ్ల నిర్మాణం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.