తెలంగాణ అసెంబ్లీలో బుధవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బుధవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పంపిణీలో జాప్యంపై బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూపంపిణీపై వైఎస్ఆర్ సీపీ, బీసీ సబ్ప్లాన్, బడ్జెట్లో బీసీలకు అన్యాయంపై టీడీపీ, ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపులపై సీపీఐ, సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, బకాయిల చెల్లింపులపై సీపీఎం వాయిదా తీర్మనాలు ఇచ్చాయి. కాగా బడ్జెట్పై నేడు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.