రూ.79 తగ్గిన డీఏపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం జీఎస్టీ నుంచి రైతాంగానికి ఊరట కలిగించింది. రైతులపై భారం పడకుండా మార్పులు చేసింది. ఎరువు లపై ప్రస్తుతం 5% వ్యాట్, ఒక శాతం సెంట్ర ల్ ఎక్సైజ్ డ్యూటీని సవరించి జీఎస్టీలో 12 % చేసిన సంగతి తెలిసిందే. రైతులు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. దీంతో జీఎస్టీని మొత్తంగా 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఎరువుల ధరల్లోనూ ఒక శాతం తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర రసా యన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారం ఎరువుల ధరలు ఎలా ఉంటాయో రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ధారించింది.
యూరి యా బస్తా పాత ధర రూ.297.50 ఉండగా, దాన్ని రూ.295కు తగ్గించారు. డీఏపీ పాత ధర బస్తా రూ.1,155 ఉండగా, దాన్ని రూ. 1,076గా నిర్ణయించారు. దీంతో డీఏపీ ఏకం గా రూ.79 తగ్గింది. కాంప్లెక్స్ పాత ధరలు రూ.865–875 మధ్య ఉండగా, తాజాగా రూ.813 చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్‌మో హన్ తెలిపారు. తగ్గిన ధరలు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించారు. తెలంగాణలో సరఫరా చేసే పలు ఎరువుల ధరలను తగ్గిస్తూ కొన్ని కంపెనీలు ప్రకటనలు జారీ చేశాయి. మంగళూరు రసాయన, ఎరువుల కంపెనీ లిమిటెడ్.. జైకిసాన్ మంగళ డీఏపీ, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ.. జైకిసాన్ సమ్రాట్ జైకిసాన్ నవరత్న డీఏపీ బస్తా ధరలను రాష్ట్రంలో రూ.1,118 నుంచి రూ.1,105లకు తగ్గించాయి.