DAP
-
జనవరి నుంచి డీఏపీ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో యూరియా తర్వాత అత్యధికంగా వినియోగించే డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) ధర జనవరి నుంచి పెరగొచ్చని తెలుస్తోంది. యాభై కిలోల బ్యాగ్‌పై కనీసంగా రూ.200 వరకు పెరిగే అవకాశముందని సమాచారం. డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్‌తో ముగియనుంది. దీని పొడిగింపుపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోయింది. ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరిగి ఆమేరకు డీఏపీ ధర పెరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి చేసుకునేవే. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగం అవుతుండగా, అందులో 60 లక్షల టన్నుల మేర దిగుమతి అవుతోంది. దేశీయ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా దిగుమతి చేసుకునేవే. డీఏపీ ధరను రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తోంది. ఈ గడువు డిసెంబర్‌తో 31తో ముగియనుంది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇంతవరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే సుమారు రూ.200 మేర పెరిగి రూ.1,550కి చేరే అవకాశముందని అంటున్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలు, చైనా నుంచి తగ్గిన ముడి సరుకు సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సవాళ్లు సైతం ధరల పెరుగుదలకు కారణాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
భగ్గుమంటున్న డీఏపీ!
సాక్షి, హైదరాబాద్: రైతులు పొలాల్లో వాడే డీఏపీ ఎరువు ధర భారీగా పెరిగింది. ఒక్కో బస్తాపై ఏకంగా రూ.300 పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా.. రూ.1,650కు పెంచడం గమనార్హం. అయితే ఈ పెంపు పాత స్టాక్‌కు వర్తించదని మార్క్‌ఫెడ్ అధికా రులు చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం పాత స్టాకు కు కూడా కొత్త ధర వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కిలో వేసేందుకు డీఏపీ, యూరియా అవసరమని... ఇలాంటి తరుణంలో మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు నానో డీఏపీ, నానో యూరియాతీసుకోవాలంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. నానో యూరియా బాటిల్ ధర రూ.252 ఉంటే.. దానికి కూడా రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇలా ధర పెంచి అమ్ముతున్నా మార్క్ఫెడ్గానీ, వ్యవసాయశాఖగానీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత... యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. రైతులు ఓవైపు వానాకాలం సీజన్ పంటలను మార్కెట్లో అమ్ముకుంటూ.. మరోవైపు రెండో పంటకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 3.14 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో ఆహార ధాన్యాలు 1.57 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 1.32 లక్షల ఎకరాల్లో వేశారు. చాలా మంది రైతులు పంటలు వేసేందుకు పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో డీఏపీ, ఇతర ఎరువులు వేస్తారు. దీనితో ఎరువులకు డిమాండ్ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో డీఏపీ నిల్వలు కేవలం 4 వేల టన్నులే ఉన్నాయని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్తున్నారు. యాసంగి సీజన్‌కు 20వేల టన్నుల నుంచి 30వేల టన్నుల వరకు డీఏపీ అవసరమని.. వచ్చే వారం దాదాపు 9 వేల టన్నుల స్టాక్ రాష్ట్రానికి రానుందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్న వ్యాపారులు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశంలోకి డీఏపీ దిగుమతులు తగ్గాయని.. రాష్ట్రంతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ డీఏపీ కొరత ఉందని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. అయితే హరియాణా వంటి రాష్ట్రాల్లో రైతులు డీఏపీ కొరతపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. మన వద్ద కూడా సకాలంలో డీఏపీ అందుబాటులోకి రాకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు, కొందరు వ్యాపారులు డీఏపీని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మేసుకుని చెప్పక.. కేంద్రం నుంచి స్టాక్ రాక.. రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తుండగా... వాస్తవానికి క్షేత్రస్థాయిలో నిల్వలు లేవని సమాచారం. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారని... కానీ ఈ సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలిసింది. దీనితో ఎరువుల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పాత స్టాక్‌కు పాత ధరే చెల్లించాలి.. డీఏపీ ధర బస్తాకు రూ.300 పెరిగి.. రూ.1,650 అయింది. అయితే పాత స్టాక్‌కు ఈ పెరిగిన ధర వర్తించదు. పాత ధరకే అమ్మాలి. కొత్త స్టాక్‌ను మాత్రమే పెరిగిన ధరకు అమ్మాలి. రైతులు దీనిని గమనించి వ్యాపారులకు సొమ్ము చెల్లించాలి. – శ్రీనివాసరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ -
డీఏపీకి ‘గాజా’ దెబ్బ
ఎక్కడో జరిగిన చర్య ఇంకెక్కడో ప్రతి చర్యకు కారణమవుతుందంటారు. హరియాణా రైతుల విషయంలో అది నిజమవుతోంది. ఏడాదిగా సాగుతున్న గాజా సంక్షోభం భారత్‌లో డీఏపీ కొరతకు దారి తీస్తోంది. హరియాణా రైతులు రోడ్డెక్కేందుకు కారణంగా మారుతోంది. హరియాణాలోని సిర్కా ప్రాంతంలో రైతులు వారం రోజులుగా రోడ్డెక్కుతున్నారు. రబీ సీజన్ వేళ తమకు సరిపడా డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్ఫేట్) ఎరువు సరఫరా చేయాలంటూ ఆందోళనకు దిగితున్నారు. పలు ఇతర జిల్లాల్లో కూడా రైతులు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద కొద్ది రోజులుగా బారులు తీరుతున్నారు. కొరత నేపథ్యంలో డీఏపీ మున్ముందు దొరుకుతుందో లేదోనని ఎగబడ్డారు. దాంతో పోలీసులు లాఠీచార్జీ చేసేదాకా వెళ్లింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆవాలు, గోధుమ పంటల దిగుబడి బాగా రావాలంటే డీఏపీ తప్పనిసరి. ఆ మూడు రాష్ట్రాల్లో పంటలకు డీఏపీని విరివిగా వాడుతారు. పంటల నత్రజని, సల్ఫర్ అవసరాలను డీఏపీ బాగా తీరుస్తుంది. ఆ రాష్ట్రాల రైతులను డీఏపీ కొరత ఇప్పుడు తీవ్రంగా వేధిస్తోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధంతో ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు డీఏపీ సరఫరాలో ఆలస్యానికి ప్రధాన కారణంగా మారాయి. గాజాలో ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం దెబ్బకు ప్రపంచ సరకు రవాణా గొలుసు అక్కడక్కడా తెగింది. దాంతో ఎరువుల దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు కష్టాలు పెరిగాయి. ఏటా 100 లక్షల టన్నులు భారత్ ఏటా 100 లక్షల టన్నుల డీఏపీని వినియోగిస్తోంది. వీటిలో అధిక భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణాలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, కర్నాటకల్లోనూ డీఏపీ వాడకం ఎక్కువే. డీఏపీ లోటు ప్రస్తుతం ఏకంగా 2.4 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. దాంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డీఏపీ కష్టాలు మరింత పెరిగాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో విస్తరించి ఇరాన్, లెబనాన్, హెజ్»ొల్లా, హూతీలు ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఎర్రసముద్రంలో ఉద్రిక్తత పెరిగి అతి కీలకమైన ఆ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా సరకు రాకపోకలు బాగా తగ్గాయి. సరఫరాలపై హౌతీల దెబ్బ! సరకు రవాణా విషయంలో ఎర్రసముద్రం చాలా కీలకం. మద్యధరా సముద్రాన్ని సూయాజ్ కాల్వ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపేది అదే. అలాంటి ఎర్ర సముద్రంపై యెమెన్‌లోని హౌతీలు పట్టుసాధించారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకంగా మారారు. వాటిపై తరచూ దాడులకు తెగబడుతుండటంతో ఎర్రసముద్రం మీదుగా సరకు రవాణా బాగా తగ్గిపోయింది. దగ్గరి దారి అయిన సూయాజ్ ద్వారా రావాల్సిన సరకు ఆఫ్రికా ఖండాన్నంతా చుడుతూ కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా తిరిగి రావాల్సి వస్తోంది. అలా ఒక్కో నౌక అదనంగా ఏకంగా 6,500 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా సరకు డెలివరీ చాలా ఆలస్యమవుతోంది. కేంద్రం దీన్ని ముందుగానే ఊహించింది. సెప్టెంబర్–నవంబర్ సీజన్లో ఎక్కువ ఎరువును అందుబాటు ఉంచాలని భావించినా ఆ స్థాయిలో సరకు దిగుమతి కాలేదు. దాంతో డీఏపీ కొరత అధికమైంది. భారత్ 2019–20లో 48.7 లక్షలు, 2023–24లో 55.67 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీని దిగుమతి చేసుకుంది. ప్రత్యామ్నాయంగా ఎన్పీకే డీఏపీకి బదులు నైట్రోజన్, పాస్ఫరస్, పొటా షియం (ఎన్పీకే) ఎరువును వాడాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. హరియాణాకు 60,000 మెట్రిక్ టన్నుల ఎన్పీకే కేటాయించామని, అందులో 29,000 టన్నులు రైతులకు అందిందని చెబుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడే డీఏపీ కొరత తప్పదన్న భయాందోళనలు తలెత్తాయి. గాజా సంక్షోభం పుణ్య మా అని అవి తీవ్రతరమవుతున్నాయి.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం.ధరాభారం కూడా... అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల వల్ల కూడా కేంద్రం భారీగా డీఏపీని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 సెప్టెంబర్‌లో టన్ను డీఏపీ 589 డాలర్లుంటే ఈ సెప్టెంబర్‌కల్లా 632 డాలర్లకు ఎగబాకింది. అయినా కేంద్రం రాయితీ రూపేణా ఆ భారాన్ని భరిస్తూ వచ్చింది. 2020–21 సీజన్ నుంచి 50 కేజీల సంచి ధర రూ.1,350 దాటకుండా చూసింది. రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్ట్, మొరాకో, చైనాల నుంచి కూడా డీఏపీని దిగుమతి చేసుకుంటోంది. హరియాణా రైతులకు ఆందోళన అవసరం లేదని సీఎం నయాబ్ సింగ్ సైనీ చెప్పుకొచ్చారు. నవంబర్ కోటా కింద 1.1 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ సిద్ధంగా ఉందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థి తులు అందుకు భిన్నంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా జిల్లాల్లో డీఏపీ సంచుల కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. కొందరు రైతులే డీఏపీని ముందస్తుగా భారీ పరిమాణంలో కొనేయడమే మిగతా వారికి సమస్యగా మారిందని హరియాణా సీఎం కార్యాలయం వివరణ ఇవ్వడం విశేషం. -
రాష్ట్రంలో డీఏపీ కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు. జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్‌కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. -
వచ్చేస్తోంది ‘నానో డీఏపీ’.. అర లీటర్ డీఏపీ బాటిల్ కేవలం రూ.600లే
సాక్షి, అమరావతి: నానో యూరియా మాదిరిగానే నానో డీఏపీ (డైఅమ్మోనియం ఫాస్పేట్) కూడా వచ్చేస్తోంది. తొలకరి సీజన్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో–ఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో) సర్వం సిద్ధం చేసింది. 2021లో మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా రైతుల మన్ననలు పొందుతోంది. తాజాగా ఈ ఖరీఫ్ నుంచే నానో డీఏపీని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అర లీటర్.. 50 కేజీల బస్తాతో సమానం గుళికల రూపంలో ఉండే సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌తో కలిసి నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో సూక్ష్మ ఎరువులను మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం విదితమే. నానో యూరియా మాదిరిగానే.. నానో డీఏపీ కూడా 500 మిల్లీ లీటర్ల బాటిల్ 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తాతో సమానమని ఇఫ్కో స్పష్టం చేస్తోంది. డీఏపీ ఎరువుల బస్తా ధర మార్కెట్లో రూ.1,350 ధర పలుకుతోంది. నానో యూరియా అర లీటర్ బాటిల్ ధర కేవలం రూ.600 మాత్రమే. అంటే సంప్రదాయ డీఏపీ ఎరువుల బస్తాతో పోలిస్తే రూ.750 తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతుంది. ఎన్నో ప్రత్యేకతలు డీఏపీ ఎరువుల వినియోగం పంటల సాగులో చాలా కీలకం. మార్కెట్లోకి రానున్న నానో డీఏపీ పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించకుండా.. పంటలకు అవసరమైన పోషక అవసరాలను తీరుస్తుంది. నానో డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతం ఉంటుంది. నానో డీఏపీ కణ పరిమాణం 100 నానోమీటర్ కంటే తక్కువగా ఉండటం వల్ల విత్తనం లోపలికి, శ్వాస క్రియ ద్వారా మొక్కలలోకి సులభంగా ప్రవేశిస్తుంది. పంటలకు అవసరమైన నత్రజని (నైట్రోజన్), భాస్వరం (ఫాస్పరస్ పెంటాక్సైడ్)ను సమపాళ్లలో అందిస్తుంది. మొక్కల్లో వీటి లోపాలను సరిచేస్తుంది. సమపాళ్లలో వ్యాప్తి చెందడం వల్ల విత్తన శక్తితోపాటు కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం పెరుగుతుంది. మెరుగైన, నాణ్యమైన పంటల దిగుబడికి దోహదపడుతుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో పోషక వినియోగ సామర్థ్యం 90 శాతానికి పైగానే ఉన్నట్టు నిర్ధారించారు. రానున్న ఖరీఫ్‌లో 4.50 లక్షల లీటర్లు (9లక్షల బాటిల్స్), రబీలో 5.50 లక్షల లీటర్లు (11లక్షల బాటిల్స్) అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో నానో జింక్, నానో కాపర్ కూడా.. ఎరువుల మార్కెట్ రంగంలో భారత శాస్త్రవేత్తలు నానో యూరియాను సృష్టించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇందుకుగాను ఇఫ్కో పేటెంట్ కూడా పొందింది. ఇప్పుడు శాస్త్రవేత్తల కృషితో అదే బాటలో నానో డీఏపీని మార్కెట్లోకి తీసుకొస్తోంది. త్వరలో నానో జింక్, నానో కాపర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఇఫ్కో సన్నాహాలు చేస్తోంది. వినియోగం పెరుగుతోంది ఖరీఫ్–1021లో మార్కెట్లోకి తీసుకొచ్చిన నానో యూరియా వినియోగంపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఖరీఫ్–21లో రాష్ట్రంలో 17 వేల లీటర్ల నానో యూరియా అమ్ముడు కాగా.. తరువాత ఏడాది 2.73 లక్షల లీటర్లు అమ్ముడైంది. 2022–23 ఖరీఫ్‌లో 1.25 లక్షల లీటర్లు, రబీలో 2.40 లక్షల లీటర్ల మేర విక్రయాలు జరిగాయి. సూక్ష్మ ఎరువులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తుండటంతో రైతుల్లో చైతన్యం పెరిగి 2023–24 వ్యవసాయ సీజన్ నుంచి నానో యూరియా నిల్వలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు వచ్చే ఖరీఫ్ సీజన్లో 12.50 లక్షల లీటర్లు, రబీలో 17.50 లక్షల లీటర్లు నానో యూరియా నిల్వలు రాష్ట్రానికి కేటాయించింది. నానో యూరియాతో పాటు కొత్తగా వస్తున్న నానో డీఏపీని ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటి వినియోగంపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఎకరాకు బాటిల్ యూరియా వేశా వరిలో ఎకరాకు 3–4 బస్తాల యూరియా వాడేవాళ్లం. ప్రస్తుతం ఎకరాకు ఒక బాటిల్ మాత్రమే వాడాను. చామంతి, టమోటా, మిరప తోటల్లో కేఊడా వాడుతున్నాను. మంచి ఫలితం కనిపిస్తోంది. మిరప కాయలో మంచి ఊట, ఎదుగుదల కన్పిస్తోంది. – పి.నాగబాబు, నాగాయతిప్ప, కృష్ణా జిల్లా నానో డీఏపీ రెడీ చేస్తున్నాం నానో డీఏపీ రెడీ చేస్తున్నాం. మార్క్‌ఫెడ్ ద్వారా నానో డీఏపీని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని వినియోగం వల్ల రైతులకు ఎరువుల ఖర్చులు బాగా తగ్గుతాయి. నానో యూరియా వినియోగంపై రైతుల్లో చైతన్యం పెరుగుతోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయిలో నానో యూరియాను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. డిమాండ్‌ను బట్టి నిల్వలు పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. – టి.శ్రీధర్‌రెడ్డి, స్టేట్ మార్కెటింగ్ మేనేజర్, ఇఫ్కో -
నానో డీఏపీతో సాగు మరింత సులువు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నానో లిక్విడ్ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన ట్వీట్‌కు ప్రధాని ఈ మేరకు స్పందించారు. ఎరువులపై స్వావలంబన దిశగా ఇది పెద్ద ముందడుగుగా ప్రధాని పేర్కొన్నారు. ఎరువుల సహకార సంఘం ఇఫ్కో 2021లో నానో లిక్విడ్ యూరియాను ప్రవేశపెట్టింది. -
ఎరువులపై రూ.60,939 కోట్ల సబ్సిడీ
న్యూఢిల్లీ: డీఏపీ సహా ఫాస్పాటిక్ అండ్ పొటాలిక్ ఎరువులకు రూ.60,939 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. రైతులకు నాణ్యమైన ఎరువులు సరసమైన ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ఫాస్ఫాటిక్ అండ్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం అంటే ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ సబ్బిడీని కేటాయిస్తున్నట్టుగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు విస్తరిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ సేవలు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడున్న 2జీ మొబైల్ సేవలను 4జీకి అప్‌గ్రేడ్ చేసేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూఎస్ఓఎఫ్ ప్రాజెక్టు కింద 2,343 వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 2జీ నుండి 4జీ మొబైల్ సేవలను రూ.2,426 కోట్ల అంచనా వ్యయంతో (పన్నులు, సుంకాలు మినహాయించి) అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఈ– గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలి–మెడిసిన్ డెలివరీ, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా టెలి ఎడ్యుకేషన్ మొదలైన సేవలు సులువుగా అందుతాయి. -
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం రైతులకు పండుగ ముందు తీపికబురు అందించింది. రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా ఎరువులపై రాయితీని కేంద్రం భారీగా పెంచింది. ప్రస్తుతం యూరియాపై అందిస్తున్న రాయితీని రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు అందించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు ఇస్తున్న రాయితీ ధర రూ.1200 నుంచి రూ.1650కి, ఎన్పీకే ఎరువుపై ఇస్తున్న రాయితీ ధర రూ.900 నుంచి రూ.1015కి, ఎన్ఎస్ పీపై ఇస్తున్న రాయితీ ధరను రూ.315 నుంచి రూ.375కి పెంచింది. ఈ రాయితీ పెంపు నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.28వేల కోట్ల భారం పడనుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని కేంద్ర మంత్రి వివరించారు.(చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!) -
డీఏపీపై సబ్సిడీ పెంపునకు కేంద్రం కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: డీఏపీ (డై అమోనియం ఫాస్ఫేట్) బస్తా పాత ధరకే లభించనుంది. డీఏపీ బస్తాకు రూ.700 చొప్పున సబ్సిడీని పెంచుతూ గత నెలలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఏడాది డీఏపీ బస్తా ధర రూ. 1,700 ఉండగా, కేంద్రం రూ. 500 సబ్సిడీ ఇవ్వడంతో కంపెనీలు రూ. 1,200కు బస్తా చొప్పున విక్రయించాయి. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల కారణంగా డీఏపీ బస్తా రూ. 2,400 లకు చేరుకుంది. రైతులకు పాత ధరకే డీఏపీ బస్తా లభించేలా కేంద్రం తాజాగా సబ్సిడీని రూ. 1,200లకు పెంచింది. డీప్ ఓషియన్ మిషన్‌కు ఓకే సముద్ర వనరుల సుస్థిర వినియోగానికి వీలుగా రానున్న ఐదేళ్లలో రూ. 4,077 కోట్లు వెచ్చించేందుకు కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదన అయిన ‘డీప్ ఓషియన్ మిషన్’కు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ప్రధానంగా ఆరు భాగాలుగా ఉంటుంది. డీప్ సీ మైనింగ్‌లో భాగంగా సముద్రంలో 6 వేల మీటర్ల అడుగున ఖనిజాల అన్వేషణకు వీలుగా శాస్త్రీయ సెన్సార్లు, పరికరాల సహితంగా ముగ్గురు మనుషులను తీసుకెళ్లగలిగే ఒక సబ్మెర్సిబుల్ను అభివృద్ధి చేస్తారు. ఇప్పటివరకు కొన్ని దేశాలకు మాత్రమే ఇలాంటి సామర్థ్యం ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విభజన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఏడు ప్రభుత్వరంగ సంస్థలుగా విభజించింది. కేబినెట్ దీనికి బుధవారం ఆమోదముద్ర వేసింది. జవాబుదారీతనం, పోటీతత్వం, పనితీరును మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశంలోని 41 ఆయుధ కర్మాగారాలు, సైనిక ఉత్పత్తుల సంస్థలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద ఉన్నాయి. -
డీఏపీ రూ.1,200కే బస్తా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైతులకు తీపికబురు అందించింది. డీఏపీపై సబ్సిడీని ఏకంగా 140 శాతం పెంచింది. ఫలితంగా రైతులకు పాత ధరకే... రూ. 1,200లకు బస్తా (50 కేజీలు) చొప్పున డీఏపీ దొరకనుంది. ‘రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. డీఏపీ ఎరువును పాతధరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’ అని ప్రధానమంత్రి మోదీ బుధవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు డీఏపీపై బస్తాకు రూ. 500 సబ్సిడీ చెల్లిస్తోంది. దాన్ని 140 శాతం పెంచి రూ.1,200లు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల మూలంగా రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో పెరిగిన మొత్తం భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్రంపై వచ్చే ఖరీఫ్ సీజన్లో రూ.14,774 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది డీఏపీ బస్తా రూ.1,700కు ఉండగా... అందులో రూ.500 కేంద్రం రాయితీ ఇవ్వడంతో రైతులకు రూ.1,200కే కంపెనీలు అమ్మాయి. అంతర్జాతీయంగా ఇటీవల ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియా ధరలు 60 నుంచి 70 శాతం పెరగడంతో డీఏపీ బస్తా ధర రూ.2,400కు చేరింది. కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ పోను రూ. 1,900లకు రైతులకు అమ్మాల్సిన పరిస్థితి. దీని ప్రకారం బస్తాపై రూ.700 పెంచుతున్నట్లు ఇఫ్కో ఏప్రిల్‌లో ప్రకటించినా... తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వెనక్కి తగ్గింది. అయినా కొన్ని కంపెనీలు ధరలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎపీపై రాయితీని బస్తాకు రూ. 500 నుంచి రూ. 1,200కు పెంచాలని నిర్ణయించారు. అంటే బస్తా ఖరీదు రూ.2,400 రూపాయల్లో 1,200 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్న మాట. దాంతో రైతుకు 50 కేజీల డీఏపీ బస్తా రూ.1,200లకే లభించనుంది. అంతర్జాతీయంగా ఫాస్ఫరిక్ ఆమ్లం, అమ్మోనియా ధరలు పెరగడం వల్ల ఎరువుల ధర పెరిగినప్పటికీ దేశంలోని రైతులకు పాతధరలకే ఎరువులు అందజేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. -
రైతులకు ప్రధాని మోదీ శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రైతాంగానికి ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. డీఏపీ బస్తాపై ప్రస్తుతం అందుతున్న రూ.500ల సబ్సిడీని రూ.1200లకు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో ఓ బస్తా డీఏపీపై 140 శాతం సబ్సిడీ లభించనుంది. ఎరువుల ధరపై బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఉన్నప్పటికీ రైతు అతి తక్కువ ధరకే ఎరువులు పొందాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. కాగా, సవరించిన సబ్సిడీ ధరలతో కేంద్ర ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుంది. -
డీఏపీ ధర పెంచవద్దు
న్యూఢిల్లీ: డీఏపీ తదితర యూరియాయేతర ఎరువుల గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)ని పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎరువుల కంపెనీలను ఆదేశించింది. వాటిని పాత రేట్లకే అమ్మాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా యూరీయాయేతర ఎరువుల రేట్లను పెంచడంపై కేంద్రం ఈ మేరకు ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), మ్యూరియేట్ ఆఫ్ పొటాష్(ఎంఓపీ), ఎన్పీకే తదితర నాన్ యూరియా ఎరువుల రిటెయిల్ ధరల నిర్ధారణను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయా ఫర్టిలైజర్ కంపెనీలే ఆ ధరలను నిర్ధారిస్తాయి. అయితే, ప్రభుత్వం ఏటా వాటికి నిర్ధారిత మొత్తంలో సబ్సీడీ ఇస్తుంది. ‘ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల ధరలను పెంచవద్దని ఫర్టిలైజర్ కంపెనీలకు సూచించింది. గతంలో ఉన్న రేట్లకే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. దానికి ఆ కంపెనీలు అంగీకరించాయి’ అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. రైతులకు పాత ధరలకే ఆ ఎరువులు లభిస్తాయన్నారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకుల ధర భారీగా పెరగడంతో ఇటీవల ఈ ఎరువుల ధరలను పెంచుతూ ఫర్టిలైజర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి క్రిభ్కో, ఎంసీఎఫ్ఎల్, జువారీ అగ్రో కెమికల్స్, పారాదీప్ ఫాస్పేట్స్ సంస్థలు డీఏపీ చిల్లర ధరను బ్యాగ్‌కు రూ. 17 వందలకు పెంచాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పాస్ఫరస్, పొటాషియం ఎరువుల ధరలకు ఇచ్చే సబ్సీడీలో ఎలాంటి మార్పు ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. గత సంవత్సరం నైట్రోజన్(ఎన్)కు కేజీకి రూ. 18.78 చొప్పున, ఫాస్పేట్(పీ)కు కేజీకి రూ. 14.88 చొప్పున, పొటాష్(కే)కు రూ. 10.11 చొప్పున, సల్ఫర్‌కు రూ. 2.37 చొప్పున సబ్సిడీని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగనుంది. -
భారీగా పెరిగిన డీఏపీ ధరలు..
సాక్షి, హైదరాబాద్: ఎరువుల ధరలను ఇఫ్కో కంపెనీ భారీగా పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... దాన్ని ఏకంగా రూ.1,900 చేయడం గమనార్హం. అంటే ఒక బస్తాపై రూ.700 పెంచింది. ఈ ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమలులోకి వచ్చాయని ఇఫ్కో తెలిపింది. అలాగే కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా ఒక్కో బ్యాగుపై రూ. 425 నుంచి రూ. 615 వరకు పెరిగాయి. పాత స్టాకును పాత ధరకే విక్రయించాలని, కొత్త సరుకుకు మాత్రమే పెరిగిన ధరలు వసూలు చేయాలని ఇఫ్కో తెలిపింది. అయితే ఇప్పుడు పాత స్టాకే అందుబాటులో ఉందని, ఇంకా కొత్త స్టాక్ మొదలు కాలేదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతూ అనేక రకాలుగా అన్నదాతలపై భారం పడుతుండగా ఎరువుల ధర భారీగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా మన రాష్ట్రంలో రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. రాష్ట్రంలో రెండు సీజన్లలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులు వాడుతున్నారు. అయితే వేయాల్సిన దానికంటే ఎక్కువగా వేస్తున్నారు. ఇది కూడా అన్నదాతపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దేశంలో సగటున ఎకరానికి 51.2 కిలోల ఎరువులు వాడితే, రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల ఎరువులు రైతులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే ఒక బస్తా ఎరువులు వేయాల్సిన చోట మరో రెండు, మూడు బస్తాలు ఎక్కువ వేస్తున్నారు. దేశంలో యూరియా ధరలపై కేంద్రం నియంత్రణ ఉంది. ధరల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. కానీ మిగతా ఎరువుల విషయానికొస్తే మాత్రం కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. ఏమైనా అంటే ముడిసరకుల ధరల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించిన ముడిసరకును ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఫాస్పరిక్ ఆమ్లం ధర పెరగడంతో ఎరువుల ధర భారీగా పెంచాల్సి వస్తోందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరగడంతో తాము అనివార్యంగా రైతులపైనే భారం వేయాల్సి వస్తోందంటున్నారు. కాగా ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచాలని నెలన్నర క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..! -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్‌ఫెడ్‌కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్‌ఫెడ్ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో యూరియా - 8.50 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు - 10.90 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై.. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,800 మెట్రిక్ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్‌ఫెడ్ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్‌లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా ధరలు... జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ధరల ప్రకారం ప్యాక్స్‌కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్ ఎరువులకు మార్క్‌ఫెడ్ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్‌ఫెడ్ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం. -
డీఏపీ ధరలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: సాగు ఖర్చు తగ్గించాలని, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ఇటీవల బడ్జెట్లోనూ రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ ఆచరణలో అందుకు విరుద్ధమైన చర్యలకు దిగింది. సాగు ఖర్చు పెరిగేలా చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర కనుసన్నల్లోనే ఎరువుల ధరలను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ ప్రకారం పెరిగిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఎరువుల ధర పెరిగిన కారణంగా ఒక్కో ఎకరాకు అదనంగా రూ.వెయ్యి వరకు రైతుపై భారం పడుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రబీలో రైతులకు ఇది శాపంగా మారుతుందని భావిస్తున్నారు. వచ్చే జూన్‌లో మరోసారి ధరలను పెంచాలని కంపెనీలు యోచిస్తుండటం గమనార్హం. డీఏపీ బస్తా రూ.1,215 ప్రస్తుతం రబీ సీజన్లో వరి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. వరి నాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు విరివిగా ఉపయోగించే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు భారీగా పెంచేశాయి. డీఏపీ 50 కిలోల బస్తా ప్రస్తుత ధర రూ.134 పెంచాయి. దీంతో రూ.1,081గా ఉన్న ధర, తాజా పెంపుతో రూ.1,215కు చేరింది. 0.5 శాతం జింక్ ఉండే డీఏపీ ప్రస్తుత ధర రూ.1,107 కాగా, రూ.1,240 పెరిగింది. అంటే కంపెనీలు బస్తాకు రూ.133 అదనంగా పెంచేశాయి. ఇక కాంప్లెక్స్ ధరలు రూ.57 నుంచి రూ.120 వరకు అదనంగా పెరిగాయి. రూ.1,940 కోట్ల భారం ప్రస్తుత రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.92 లక్షల ఎకరాలు. రానున్న ఖరీఫ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి 1.42 కోట్ల ఎకరాల భూములు సాగులోకి వస్తాయని అంచనా. అవిగాక మరో 20 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. మొత్తంగా ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఒక ఎకరాకు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఏడు బస్తాలు వాడుతారని అంచనా. ఆ ప్రకారం చూస్తే పెంచిన ధరల ప్రకారం రైతుపై అదనంగా రూ.వెయ్యి భారం పడుతుంది. అంటే ఈ రబీలో రైతులపై అదనంగా రూ.320 కోట్ల అదనపు భారం పడుతుంది. రానున్న ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలు సాగులోకి వస్తే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల కారణంగా రైతులపై రూ.1,620 కోట్ల అదనపు భారం పడనుంది. మొత్తంగా రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులపై రూ.1,940 కోట్ల అదనపు భారం పడుతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎరువులకూ సరిపోని ‘పెట్టుబడి’! ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో 1.62 కోట్ల ఎకరాలకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి పథకం కింద సాయం చేయనుంది. అయితే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకే ఈ మొత్తం ఇస్తుంది. ఆ ప్రకారం వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు ఇవ్వనుంది. ఆ మేరకు బడ్జెట్ ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ పంపింది. ఆ మొత్తంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుకే రైతులు అదనంగా రూ.1,620 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. అదనపు ధరలకే రైతులు 25 శాతం వరకు ఖర్చు చేస్తారని అర్థమవుతోంది. ఎరువుల వాస్తవ ధర, యూరియా ధరలను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వం వారికిచ్చే సొమ్ము సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. -
రూ.79 తగ్గిన డీఏపీ
సాక్షి, హైదరాబాద్: కేంద్రం జీఎస్టీ నుంచి రైతాంగానికి ఊరట కలిగించింది. రైతులపై భారం పడకుండా మార్పులు చేసింది. ఎరువు లపై ప్రస్తుతం 5% వ్యాట్, ఒక శాతం సెంట్ర ల్ ఎక్సైజ్ డ్యూటీని సవరించి జీఎస్టీలో 12 % చేసిన సంగతి తెలిసిందే. రైతులు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. దీంతో జీఎస్టీని మొత్తంగా 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న ఎరువుల ధరల్లోనూ ఒక శాతం తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర రసా యన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకారం ఎరువుల ధరలు ఎలా ఉంటాయో రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ధారించింది. యూరి యా బస్తా పాత ధర రూ.297.50 ఉండగా, దాన్ని రూ.295కు తగ్గించారు. డీఏపీ పాత ధర బస్తా రూ.1,155 ఉండగా, దాన్ని రూ. 1,076గా నిర్ణయించారు. దీంతో డీఏపీ ఏకం గా రూ.79 తగ్గింది. కాంప్లెక్స్ పాత ధరలు రూ.865–875 మధ్య ఉండగా, తాజాగా రూ.813 చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మో హన్ తెలిపారు. తగ్గిన ధరలు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించారు. తెలంగాణలో సరఫరా చేసే పలు ఎరువుల ధరలను తగ్గిస్తూ కొన్ని కంపెనీలు ప్రకటనలు జారీ చేశాయి. మంగళూరు రసాయన, ఎరువుల కంపెనీ లిమిటెడ్.. జైకిసాన్ మంగళ డీఏపీ, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ.. జైకిసాన్ సమ్రాట్ జైకిసాన్ నవరత్న డీఏపీ బస్తా ధరలను రాష్ట్రంలో రూ.1,118 నుంచి రూ.1,105లకు తగ్గించాయి. -
రూ.50 తగ్గిన డీఏపీ ధరలు
పెద్దేముల్: డీఏపీ ఎరువుల ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. నెలరోజుల క్రితం గోదావరి 50 కిలోల బస్తా రూ.1,303 ఉండగా, తరువాత రూ1,260కి విక్రయించారు. రెండు రోజుల క్రితం పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘం అధికారులు రూ.1,155కి విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు ఎరువులు ఖరీదు చేసుకోవాలన్నారు. కాగా కొన్ని గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో మాత్రం అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, రసీదులు అడగితే ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. -
ఎరువు.. ‘ధర’వు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ‘మూలిగె నక్కపై తాటికాయ పడ్డ’ చందంగా.. రైతున్నలకు ప్రభుత్వాలు షాక్‌ల మీద షాక్లనిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కనికరించని ప్రకృతి.. ఆదుకోని కరెంటుతో అన్నదాతలు కష్టాల సాగును నెట్టుకొస్తున్నా.. చివరికి వారికి మిగిలేది అప్పులే. మద్దతు ధర లేక.. మార్కెట్లలో దళారుల దోపిడీతో ఏటా నష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో పూర్తిగా నష్టపోయిన రైతులకు రబీ సాగు మరింత భారం కానుంది. తాజాగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పది శాతం పెరగడంతో ఆ భారం కోట్లకు చేరింది. ఇప్పటివరకు 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,192 ఉండగా.. పెంచిన ధరతో రూ.1,249కి చేరింది. కాంప్లెక్స్ పాత ధర రూ.919 ఉండగా.. కొత్త ధరతో రూ.955కు విక్రయించనున్నారు. పలు కంపెనీల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గుతో సరాసరి రూ.50 నుంచి రూ.60 వరకు పెరగనున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం.. ఖరీఫ్ రబీ సాగు కలిపి 20,445 మెట్రిక్ టన్నుల డీఏపీ, 15,214 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అవసరం పడుతుంది. డీఏపీ ఎరువుకు రూ.48 కోట్లు 25 లక్షల 18 వేలు కాగా, కాంప్లెక్స్‌కు రూ.33 కోట్ల 59 లక్షల 66 వేలు ఇది వరకు చెల్లించారు. పెంచిన ధరతో డీఏపీకి రూ.50 కోట్ల 62 లక్షల 18 వేలు, కాంప్లెక్స్‌కు రూ.34 కోట్ల 59 లక్షల 66 వేలు చెల్లించాలి. దీంతో రైతులపై ఏటా రూ.4 కోట్ల వరకు భారం పడనుంది. ఈ ధరల పెంపుతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీలు ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలను పెంచుతున్నా.. తాము పండించిన ధాన్యానికి మాత్రం ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించడం లేదం టూ విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమవడంతోనే ఏటా సాగు భారం పెరుగుతోందని దుయ్యబడుతున్నారు. రబీలో 90,100 వేల హెక్టార్ల సాగు లక్ష్యం.. వచ్చే రబీలో మొత్తం 90,100 వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వే శారు. వరి 25 వేల హెకా ర్లు, జొన్న 22 వేల హెక్టార్లు, మొక్కజొన్న 6,500, శెనగ 36 వేలు, పొద్దు తిరుగుడు 5,800, నువ్వులు 5,200, వేరుశనగ 5,500, పెసర 3,100, గోధుమ 5,500 హెక్టార్లలో సాగవుతాయని అంచనా వేశారు. ఈసారి కరువు నేపథ్యంలో అంత మేరకు సాగయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. ఇప్పటికే ఖరీఫ్‌లో నిం డా మునగడం.. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం.. మద్దతు ధర దక్కకపోవడం.. వెరసి సాగుకు వెళ్లేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సీజన్‌కు ప్రాజెక్టుల నుంచి కూడా నీరు ఇవ్వని పరిస్థితి ఉంది.