► నెలకు రూ.4లక్షల పైమాటే..
► లారీ అన్‌లోడ్‌కు రూ.200
► టెంపరరీ పర్మిట్‌కు రూ.100
► బిల్లింగ్‌కు రూ.100 వసూలు
జిల్లాలోని మద్యం డిపోలో వసూళ్ల దందా కొనసాగుతోంది. ఇది ఏకంగా నెలకు రూ.నాలుగు లక్షలకుపైమాటే. మద్యం డిపోకు లోడ్‌తో లారీ వచ్చిందా ఇక అంతే.. లారీకి రూ.200, టెంపరరీ పర్మిట్ జారీ చేస్తే రూ.100, బిల్లింగ్ చేస్తే రూ.100 చొప్పున బ్రెవరేజీ కంపెనీల నుంచి డిపో అధికారులు బెదిరింపులకు పాల్పడి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ అక్రమ దందాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమదందా వ్యవహారం నెలకు ఎంత లేదన్నా.. రూ.నాలుగు లక్షలపైగానే ఉంటోందని సమాచారం.
కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని మద్యం డిపోకు వివిధ రకాల మద్యం కంపెనీలు వారివారి మద్యాన్ని పంపిస్తుంటారు. ప్రతినెలా 25 రోజుల్లో సుమారు 600 లారీలు మద్యంతో వస్తుంటారుు. లారీ సకాలంలో డిపోలోకి వెళ్లి.. మద్యం అన్‌లోడ్ చేయూలంటే సంబంధిత డిపో అధికారులకు రూ.200 ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే సదరు లారీని రోజులతరబడి బయటనే ఉంచుతున్నారు. దీంతో చేసేది లేక కంపెనీ ప్రతినిధులు రూ.200 చెల్లించి మద్యాన్ని అన్‌లోడ్ చేరుుంచుకుంటున్నట్లు సమాచారం. ఇలా లారీలను డిపోలోకి అనుమతించడం ద్వారానే డిపో అధికారులకు సుమారు రూ.1.20 లక్షలు అనధికారికంగా సమకూరుతున్నట్లు తెలుస్తోంది. లారీ లోపలికి రావడంతో మొదలైన ఈ దందా.. మద్యం దుకాణాలకు వెళ్లేవరకూ ప్రతి దశలో కొనసాగుతూనే ఉంటుంది. టెంపరరీపర్మిట్ జారీ చేయూలంటే రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈలెక్కన ప్రతిరోజూ డిపోకు 80 నుంచి 100 వరకు లారీలు వస్తాయని అనుకున్నా.. రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.మూడు లక్షలు దాటుతారుు.
‘వసూళ్ల’కు ప్రైవేట్ వ్యక్తులు..
మద్యం డిపోలో ఈ మామూళ్ల వసూలుకు ముగ్గురు ప్రైవేట్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసింది. బీర్లతో వచ్చిన లారీల నుంచి వసూలుకు ఒకరు.. లిక్కర్ లారీ నుంచి వసూలుకు ఇద్దరు పనిచేస్తున్నారని సమాచారం. వీరు ప్రతిరోజూ వసూలు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారికి అప్పగిస్తారని తెలిసింది. వీరితోపాటు మరో ముగ్గురు పనిచేస్తున్నారని, వారికి నెలకు రూ.12 వేల చొప్పున వేతనం రూపంలో చెల్లిస్తుంటారని డిపోవర్గాల ద్వారా తెల్సింది. ఈ లెక్కన సంబంధిత వ్యాపారులు ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల దందాను దర్జాగా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉన్నతాధికారులకు తెలిస్తే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘వారికి నెలనెలా మామూళ్లు వెళ్తుంటారుు. వారు ఇటువైపు కన్నెత్తి చూడరు. వచ్చినా మమ్మల్ని ఏం చేయరు..’ అని ఓ అధికారి బహిరంగంగానే పేర్కొంటున్నాడని సదరు వ్యాపారులు చెబుతున్నారు.
ఉన్నతాధికారులకు తెలిసినా..
జిల్లాలో ఉన్న మద్యం డిపోకు చైర్మన్‌గా జారుుంట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. అరుుతే మద్యం డిపోలో పనిచేస్తున్న అధికారులపై అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. డిపోలో పనిచేస్తున్న ఓ అధికారి వారం లో మూడు రోజులు డిపోలో ఉంటాడని.. మిగిలిన మూడు రోజుల సొంత పనులపై వెళ్తుంటాడని, ఎవరైనా అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేస్తే ‘ఇప్పుడే.. బయటకు వెళ్లాడ’ని చెబుతుంటారని పలువురు గుర్తుచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి డిపో జరుగుతున్న అక్రమ వసూళ్లపై దృష్టి సారించాలని పలువురు మద్యం వ్యాపారులు కోరుతున్నారు.
మద్యం డిపోలో ‘వసూళ్ల కిక్కు’
Published Fri, May 20 2016 2:57 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement