illegal Collections
-
కర్నూలులో భక్షక భటుడి లీలలు.. క్రైంపార్టీ ముసుగులో..
కర్నూలు: పోలీసు శాఖలో ప్రక్షాళన దిశగా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఓ వైపు చర్యలు తీసుకుంటుంటే.. అవేవి పట్టనట్టు కర్నూలు నాలుగో పట్టణ స్టేషన్లో కొందరు సిబ్బంది యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎస్పీ హెచ్చరికలు ఆ స్టేషన్ అధికారులు, సిబ్బందికి తలకెక్కినట్లు లేవు. స్టేషన్లో సుమారు 70 మంది దాకా సిబ్బంది ఉన్నారు. కీలక వ్యవహారాలన్నీ క్రైం పార్టీ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు క్రైంపార్టీ ముసుగులో వసూళ్ల దందా సాగిస్తున్నారు. వీరిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ వారిని ఇతర విధులకు కేటాయించకుండా స్టేషన్‌కు వచ్చే బాధితులతో సెటిల్మెంట్లు చేసే బాధ్యతలను అధికారులే అప్పగిస్తున్నారని తెలుస్తోంది. చోరీలు నియంత్రించడం, హత్యలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం వంటి ప్రధాన విధులు పక్కనపెట్టి వసూళ్ల కార్యక్రమమే వీరి దిన చర్యగా మారింది. వీరిలో ఓ కానిస్టేబుల్ అన్నీతానై సెటిల్మెంట్ దందా కొనసాగిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ మెట్లు ఎక్కే ప్రతి ఫిర్యాదుదారుని నుంచి ఏదో ఒక రూపంలో మామూళ్లు వసూలు చేయడంలో అతను సిద్ధహస్తుడిగా సిబ్బంది బహిరంగగానే చెబుతున్నారు. పాత నేరస్తులు, జేబు దొంగలు, రౌడీషీటర్లతో పరిచయాలు పెట్టుకుని దందా నడిపిస్తున్నారు. స్టేషన్‌కు కూత వేటు దూరంలోని ఓ లాడ్జినే ఇందుకు అడ్డాగా మార్చుకున్నారు. ప్రధానంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, ఎస్పీ కార్యాలయంలోని సెంట్రల్ కంప్లయిట్ సెల్ (సీసీసీ) నుంచి వచ్చే ఫిర్యాదుదారుల వద్ద భారీగా పిండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. భక్షక భటుడి లీలలు ఇవే.. ►కర్నూలు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో కొత్తబస్టాండ్, మార్కెట్ యార్డు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్, ఈద్గా తదితర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. ఇక్కడ తరచూ జేబు దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. ►బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేయగానే దొంగలను పట్టుకురావడం.. సగం మాత్రమే రికవరీ అయ్యిందని, మిగతా సగం నొక్కేయడం పరిపాటిగా మారింది. ►చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేసినప్పుడు బాధితుల నుంచి సెల్‌ఫోన్ ఖరీదును బట్టి రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా వసూలు చేస్తున్నారు. ►నెల రోజుల క్రితం ఆ కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన ఓ వేడుకకు షరీన్ నగర్‌కు చెందిన కొంతమంది జేబు దొంగలు హాజరై కార్యక్రమాన్ని నడిపించినట్లు చర్చ జరుగుతోంది. ►ఆటోల్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ సమయంలో భారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ►స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కూడా కేసు తీవ్రతను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 50 వేల దాకా వసూలు చేస్తున్నారు. ►ఇంటి నుంచి వెళ్లి పోయిన ప్రేమ జంటలో యువతి మైనర్ అయితే పొక్సో కేసు పెడతామంటూ ఇటీవల ఇద్దరు యువకులను బెదిరించి భారీగా డబ్బు దండుకున్నారు. ►మద్యం తరలిస్తూ చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన కేసులో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్‌కు అధికారి అండతో ఇదే స్టేషన్లో పోస్టింగ్ వేయించుకుని ఇద్దరూ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ►స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఫ్యాక్టరీలో కొంతకాలం క్రితం చోరీ జరిగింది. జెడ్చర్లలో ఉన్న రెండు వాహనాలను నేరానికి ఉపయోగించినట్లు గుర్తించి పట్టుకొచ్చి అందులో ఒక వాహనాన్ని వదిలేసేందుకు భారీగా ముడుపులు వసూలు చేసినట్లు విమర్శలున్నాయి. ►కుటుంబ తగాదాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి న్యాయం కోసం ఈ స్టేషన్ కు వెళ్తే సాయం పేరుతో క్రైంపార్టీ సిబ్బంది తలదూర్చి సెటిల్మెంట్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల ఓ కాలనీకి చెందిన ఇరువర్గాలు గొడవ పడి స్టేషన్‌కు వెళ్తే భారీగా వసూలు చేశారు. -
ఇంటికి ఇంత.. ప్లాటుకు అంత.. అక్కడంతా 'రైటర్ల'రాజ్యం!
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రానికి చెందిన పి.మధుకర్‌రెడ్డి (పేరు మార్చాం) స్థానికంగా ఓ వెంచర్లో 300 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. దాని రిజిస్ట్రేషన్ కోసం స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,800 చెల్లించాడు. అయితే రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తి (డాక్యుమెంట్ రైటర్)కి చెల్లించిన ఫీజు రూ.4,000. ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కింద కట్టిన ఫీజుకు సగం అదనంగా మధ్యవర్తికి చెల్లించడం గమనార్హం. డాక్యుమెంట్ ప్రిపరేషన్, కార్యాలయంలోని వ్యవహారాన్ని చకచకా పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినా ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇండ్లు, ప్లాట్లు, భూముల రిజిస్ట్రేషన్లలో డాక్యు మెంట్ రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతు న్నారు. సొమ్ము ముట్టజెపితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా, ఎలాంటి అవాంతరాల్లేకుండా జరిగిపోతుంది. ఏవైనా పేపర్లు లేకపోవడం, సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా.. అరగంటలోనే ‘పని’ పూర్తవుతుంది. కాకపోతే దీనికి మరికొంత ఎక్కువ చేతిలో పెట్టాల్సి వస్తుంది. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఓ కొర్రీతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం కావడమో, ఒక్కోసారి మొత్తంగా ఆగిపోవడమో జరుగుతున్న పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బందికీ ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణ లున్నాయి. దీనిపై కొనుగోలు/ అమ్మకందారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశోధన చేపట్టింది. పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పరిస్థితిని నేరుగా పరిశీలించి.. ఏం జరుగుతోందన్నది గుర్తించింది. ఈ వివరాలతో ప్రత్యేక కథనం.. రైటర్లదే హవా! ఎక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లినా.. అక్కడికి కొంత దూరంలో అటూఇటూ ఒకట్రెండు టేబుళ్లు, కంప్యూటర్లు పెట్టుకుని, ఐదారు కుర్చీలున్న చిన్న చిన్న షాపులు కనబడతాయి. పొద్దంతా ఏదో హడావుడి కనిపిస్తుంటుంది. చూడటానికి సింపుల్ గానే ఉన్నా ఇండ్లు, ఫ్లాట్లు, భూములు.. ఇలా ఏ రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఆ చిన్న దుకాణాలు, వాటిని నిర్వహించే డాక్యుమెంట్ రైటర్లే కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే.. రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్నా 90 శాతం పని ఈ డాక్యుమెంట్ రైటర్ల వద్దే అయిపోతుంది. ముందే అంతా ‘సెట్ రైట్’ అవుతుంది. ఆఫీసులోకి వెళ్లాక అంతా ఫటాఫట్‌గా పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి కొనుగోలు/అమ్మకం దారులు, సాక్షులు మినహా ఇతర ప్రైవేటు వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను అనుమతించకూడదు. కానీ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ సిబ్బంది కంటే.. ఈ ‘మధ్యవర్తుల’ హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. అనధికారికంగానే అంతా.. నిజానికి డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి లైసెన్సు లేదు. ఆ వ్యవస్థపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు. డాక్యుమెంట్ సిద్ధం చేయడం నుంచి, రిజిస్ట్రేషన్ పూర్తయి కాపీ బయటికి వచ్చేదాకా.. మొత్తం పని కొర్రీలు లేకుండా, త్వరగా పూర్తిచేస్తామంటూ ఈ డాక్యుమెంట్ రైటర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. డాక్యుమెంట్ రెడీ చేసేందుకు కొంత, ఏ కొర్రీలూ రాకుండా పని అయిపోయేందుకు ఆఫీసులో ఇవ్వాల్సింది ఇంకొంత అంటూ వేలకువేలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సుమారు 2000 మంది వరకు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్టు అంచనా. రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ అనధికార డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థకు స్వస్తి పలికి.. ప్రభుత్వ జవాబుదారీతనం ఉండేలా మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా.. అది కార్యరూపంలోకి రావడం లేదు. కరోనా తర్వాత మరింత దూకుడు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ తర్వాతి పరిస్థితుల్లో డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు మరింతగా పెంచారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పట్లో డాక్యుమెంట్‌కు ఇంత అని పక్కాగా డిమాండ్ చేసేవారు కాదని.. అవకాశం, అవసరం, చేయించాల్సిన పనిని బట్టి తీసుకునే వారని అంటున్నారు. ఇప్పుడు పక్కాగా డిమాండ్ చేసి, వసూలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే ఆస్తుల విలువలో ఇంత శాతమని నిర్ణయించి వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. ఏదో ఓ కొర్రీ పెడతారని.. రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా పూర్తవుతోందని.. ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉందని ఆరోపణలున్నాయి. ఏవో సాంకేతిక సమస్యలున్నాయని, డాక్యుమెంట్లలో తప్పులున్నాయని చెబుతూ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది తిప్పుకుంటున్నారని అమ్మకం/కొనుగోలు దారులు చెప్తున్నారు. డబ్బులన్నీ తామే తీసుకోవడం లేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుందని కొందరు డాక్యుమెంట్ రైటర్లు బహిరంగంగానే అంటుండటం గమనార్హం. అయితే క్రయవిక్రయదారుల రూపంలో వస్తున్న సామాన్య ప్రజల విషయంలోనే రైటర్లు డాక్యుమెంట్ డీలింగ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వెంచర్ల నిర్వాహకులు, బడాబాబులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల సిబ్బందితోనే ‘మాట్లాడుకుని’ పని చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు. కొత్త విధానం వచ్చినట్టే వచ్చి.. కరోనా తర్వాత రాష్ట్ర సర్కారు తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో అసలు డాక్యుమెంట్ రైటర్ల అవసరమే లేకుండా పోయింది. కానీ కొన్ని కారణాలతో ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టింది. దీంతో రైటర్ల దందా మళ్లీ మొదలైంది. గతం కంటే ఎక్కువగా రేటు నిర్దేశించి మరీ తీసుకోవడం పెరిగింది. ఇలా వారు డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకుంటున్నా.. స్థానిక సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు వసూళ్లు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందికి వాటా సొమ్ము ఇస్తున్నారని.. దీంతో రైటర్లను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా వందల కోట్లు జేబుల్లోకి.. రైటర్లు డాక్యుమెంట్ తయారు చేస్తామనే కారణం చూపెట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. చూడటానికి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు మూడు, నాలుగు వేల రూపాయలేగా అన్నట్టు ఉన్నా.. మొత్తంగా చూస్తే కోట్ల రూపాయల్లోకి వెళుతున్నాయి. ఉదాహరణకు.. ఈనెల 20న (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా 5,500కుపైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. తక్కువలో తక్కువగా డాక్యుమెంట్‌కు రూ.1,000 చొప్పున లెక్కేసుకుంటే.. ఒక్కరోజు రైటర్లు వసూలు చేసింది రూ. 55 లక్షలు. నెలకు 15 కోట్లపైమాటే.. అదే ఏడాదికి లెక్కిస్తే రూ.180 కోట్లు. ఇది కేవలం నామమాత్రపు సొమ్ము మాత్రమే. నిజానికి అడ్డగోలుగా వసూలు చేస్తున్నది, రిజిస్ట్రేషన్ సిబ్బంది వాటా కింద వసూలు చేస్తున్నది కలిపితే.. రూ.వెయ్యి కోట్లకుపైనే అవుతుందని అంచనా. ఏటా ఇంత సొమ్ము దళారుల పాలవుతోంది. ఎక్కడ చూసినా అదే దందా! – రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున కమీషన్లు్ల వసూలు చేస్తున్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్ చార్జ్, చలానా, మ్యూటేషన్ కలిపి రూ.18,800 తీసుకుంటున్నారు. మిగతా ప్లాట్లకు కూడా రూ.15వేల దాకా తీసుకుంటున్నారు. డాక్యుమెంట్ తయారుచేయడం నుంచి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేదాకా తాము చూసుకుంటామని చెప్తున్నారు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ల వద్దకు వెళితే.. ఏదో ఓ కొర్రీ పెడుతున్నారని, అక్కడి సిబ్బంది కూడా రూ.1,500 నుంచి రూ.2 వేలదాకా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. – నల్లగొండ జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సగటున 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తుల వద్ద డాక్యుమెంట్ రైటర్లు తమ ఫీజు కింద రూ.1,000, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇచ్చేందుకని మరో వెయ్యి, రెండు వేలదాకా వసూలు చేస్తున్నారు. పని త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. వివాదాలున్న డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసేందుకైతే.. రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తీసుకుని ‘పని’ చక్కబెడుతున్నట్టు ఆరోపణలున్నాయి. – సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చుపై అదనంగా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు చెల్లించక తప్పని పరిస్థితి. వారు అడిగినంత ముట్టజెప్పకపోతే ఏదో ఓ లిటిగేషన్ పేరిట రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వివాదాలున్న ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల కోసమైతే.. పది వేల వరకు ముట్టజెప్పాల్సిందే. ఇదంతా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందికి వాటా ఇవ్వడం కోసమేనని రైటర్లు చెప్తుండటం గమనార్హం. – రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లు రూ.2,500 దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ సిబ్బందికి సగం వాటా ఇవ్వాలని ఓపెన్‌గానే చెప్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇక్కడ డబ్బుల వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఓ ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకోవడం గమనార్హం. – గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాలో కూడా డాక్యుమెంట్ రైటర్ల దందా సాగుతోంది. ఇక్కడి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ ప్రిపరేషన్ పేరుతో రూ.3–4 వేల వరకు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఇవ్వాలంటూ మరికొంత వసూలు చేస్తున్నారు. (చదవండి: వెంట్రుకలపై క్రేజ్: చైనాకు జుట్టు అక్రమ రవాణా) -
‘వెలుగు’ పేరుతో గోల్మాల్
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు సంఘమిత్ర కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. రుణాల మంజూరుకు చేతివాటం మొదలు వీఏఓ నిధుల స్వాహా వరకు కుంభకోణాలమయంగా మారింది. ప్రస్తుతానికి పోతిరెడ్డిపాళెం వీఏఓ రూ.6.2 లక్షల నిధుల దుర్వినియోగమయ్యాయని తేలింది. దీనిపై ఏపీఎం సుజాత, సీసీ మమతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.కోవూరు సంఘమిత్ర కార్యాలయ పరిధిలో మొత్తం 1250 గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓ ఏపీఎం, నలుగురు సీసీలు, 25 మంది వీఓఏలుంటారు. వీరి పరిధిలో గ్రూపులకు రుణాల మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అయితే రుణాలకు సంబంధించి సంఘమిత్ర ఉద్యోగులకు ముడుపులిస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోతిరెడ్డిపాళెం లీడర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. కోవూరు మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన ఒకటో నంబర్ సంఘబంధ నాయకురాలు కాకి రాజమ్మ జనవరి 23న తమ పరిధిలోని సంఘబంధంలో జమైన సబ్‌ప్లాన్ నిధుల విత్‌డ్రా, సంఘ సభ్యుల నుంచి వసూలు చేసిన సబ్‌ప్లాన్, స్త్రీ నిధి రికవరీ నిధులు జమచేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్త్రీనిధి, డీఆర్డీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి ఫిబ్రవరి 18న ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవాలని యత్నించగా, టీడీపీ నేతలు, అప్పటి మంత్రుల సిఫార్సులతో ఆగాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వారిపై ఒత్తిళ్లు పెరిగాయి. అనంతరం ఎన్నికలు రావడంతో జాప్యం తలెత్తింది. సంఘబంధం సభ్యుల నుంచి రూ.6,20,216 మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫిబ్రవరిలో విచారణ అనంతరం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.1,54,000 చెల్లించినట్లు తేల్చారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం పోతిరెడ్డిపాళెంలో నిధుల దుర్వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు వచ్చినా ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత పట్టించుకోలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. దుర్వినియోగమైన రూ.6,20,261 నిధులపై ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత, వీఓఏ అనూరాధ బాధ్యత వహించాలని తెలిపారు. నిధులు దుర్వినియోగమైనందుకు, పర్యవేక్షణ లోపానికి సెర్ప్ నిబంధనల మేరకు 2009 సెక్షన్ ఏడు ప్రకారం ఏపీఎం సుజాత, సీసీ మమతను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు పెళ్లికానుక ఏపీఎంగా పనిచేస్తున్న శేషారెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
మావోయిస్టుల పేరిట వసూళ్లు
సాక్షి, సాలూరు (విజయనగరం): తాము మావోయిస్టులమని అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని కూడా లేపేస్తామని బెదిరించిన వ్యవహారంలో నలుగురు వ్యక్తులను వలపన్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్టు పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాలూరు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి సీఐ రాంబాబుతో కలిసి ఏఎస్పీ మాట్లాడారు. సాలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్నిపల్లి ధనుంజయ్‌నాయుడు సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని వద్ద లారీ క్లీనర్‌గా పని చేస్తున్న మక్కువ మండలం శంబరకు చెందిన భానుప్రకాష్, బంగారమ్మ కాలనీకి చెందిన విద్యాసారధి, మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన కలిపిండి ఏడుకొండలు కలిసి డబ్బున్న వ్యక్తులను గుర్తించి, వారిని మావోయిస్ట్‌లమని ఫోన్లో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. సోమవారం మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన మినీ కాంట్రాక్టర్ అక్యాన రామినాయుడుకు ఫోన్ చేసి మావోయిస్ట్‌లమంటూ, తాము అడిగిన 3లక్షల రూపాయలు చెప్పిన చోటుకు తీసుకురావాలని, లేకపోతే నీతోపాటు నీ కుటుంబాన్ని లేపేస్తామని బెదించినట్టు తెలిపారు. మీ గ్రామానికి చెందిన ఇద్దరి నుంచి ఇలాగే డబ్బులు వసూలు చేసామని, ఇవ్వకపోతే పర్యావసానాలు ఎలా వుంటాయో వారిని అడిగి తెలుసుకోమని హెచ్చరించడంతో సదరు కాంట్రాక్టర్ తన స్నేహితుడికి ఉప్పందించాడన్నారు. దీంతో ఆయన మక్కువ ఎస్ఐ షేక్ శంకర్‌కు సమాచారం అందివ్వడంతో వలపన్ని పాచిపెంట మండలంలోని పారమ్మకొండ సమీపంలో నలుగురు వ్యక్తులను పట్టుకున్నామన్నారు. వారి నుంచి లక్షా 35వేల రూపాయల నగదు, నాలుగు సెల్ఫోన్లతో పాటు హోండా ఏక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరచుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి వుందన్నారు. గతంలో అక్రమ వసూళ్లు ఇదిలా వుండగా గతంలో మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ బోగి గౌరినా«ధ్ నుంచి వీరు 2లక్షల రూపాయలు, పార్టీ మారావంటూ మాజీ సర్పంచ్ బొంగు చిట్టినాయుడు నుంచి 3లక్షల రూపాయలను వసూలు చేసినట్టు ఏఎస్పీ వివరించారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందివ్వాలని ఆయన కోరారు. ఎస్ఐకు అభినందనలు ఎస్ఐగా కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటికీ మక్కువ ఎస్ఐ షేక్‌శంకర్ చాకచక్యంగా వ్యవహరించారని ఏఎస్పీ ఆయనను అభినందించారు. సమాచారం బాధితుడి నుంచి అందకపోయినా వేరే వ్యక్తి ద్వారా విషయం తెలిసినా, చురుగ్గా వ్యవహరించి, నిందితులను పట్టుకున్నారన్నారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ఎస్ శ్రీనివాస్, సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి పాల్గొన్నారు. -
వసూళ్లపై పోలీస్ అధికారుల ఆరా..?
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్లైన్ వద్దగల కోల్ ట్రాన్స్‌పోర్టులో మళ్లీ వసూళ్ల దంద మొదలైంది. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందితో ఆరా తీయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వి శ్రీనివాస్‌రావు లారీ ఓనర్స్, ట్రాన్స్పోర్టర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసూళ్లను నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ముందస్తు జాగ్రత మేరకు ఏరియాలో కోల్ ట్రాన్స్‌పోర్టుకు అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డివిజన్ ఉన్నతాధికారి ఈవసూళ్లపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కోల్‌ట్రాన్స్‌పోర్టులో గతంలో ఒక వర్గం వారే వసూళ్లు చేస్తే, ఈసారి రెండు వర్గాల వారు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నుంచి వినియోగదారులు బొగ్గును ఆన్లైన్లో కొనుగోలు చేసి, ట్రాన్స్పోర్టర్ల ద్వారా రవాణా చేయించుకుంటుంటే... ఈ మధ్యలో ఈ వసూళ్ల దందా ఏంటని, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిసింది. -
నర్సింగ్ కాలేజీలో వసూళ్లు
వరంగల్ : ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ఉన్న నర్సింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే, ఫేర్వెల్ పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారు. సాధారణంగా ఏటా ఆఖరు సంవత్సరం నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినులు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించుకుంటారు. అది కాలేజీలోని విద్యార్థులు ఇచ్చినంత డబ్బులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆ పోస్టుపై కన్నేసిన ఉద్యోగులు గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. అనుకున్న ప్రకారం విద్యార్థినుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థినుల నుంచి రూ.1500, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న వారి నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారు. ఆ డబ్బుతో ఇటీవల గ్రాడ్యుయేషన్ డేను భారీగా నిర్వహించి రాజ కీయ నాయకులను ప్రసన్నం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ డే కోసం రూ.1500 చొప్పున ఇచ్చేందుకు విద్యార్థి నుల తల్లిదండ్రులు నిరాకరించినప్పటికీ కాలేజీలోని కొందరు ఉద్యోగులు విద్యార్థినులపై ఒత్తిడి తేవడంతో చేసేదేమీ లేక ఇచ్చినట్లు కొందరి పేరెంట్స్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే చేసుకోవాలన్న నిబంధనలు లేకున్నా కాలేజీలోని కొందరు తమ పలుకుబడి పెంచుకునేందుకు భారీగా నిర్వహించారని పేరెంట్స్ వాపోతున్నారు. కాలేజీలో మూడేళ్లుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వద్ద సుమారు రూ.1.50లక్షలు వసూలైనట్లు తెలుస్తోంది. తమ పిల్లల వద్ద బలవంతంగా వసూలు చేసిన సుమారు రూ.3లక్షలను వాపస్ ఇవ్వాలని నర్సింగ్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ కార్యాలయానికి తల్లిదండ్రులు ఇటీవల ఓ లేఖ పంపారు. అందులోని ఈ విషయాలపై ఆరా తీయగా ఇంచార్జి ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, కాలేజీలోని విద్యార్థులే కమిటీగా ఏర్పడి ఫంక్షన్ నిర్వహించుకున్నారని ఉద్యోగులు తెలిపారు. అది పూర్తిగా విద్యార్థులకార్యక్రమం అది గ్రాడ్యుయేషన్ డే, ఫ్రెషర్స్ కోసం నిర్వహించిన కార్యక్రమం. ఆ కార్యక్రమ నిర్వహణకు డాక్టర్లు, నర్స్‌లు ఆర్థికసాయం అందించారు. మిగిలిన డబ్బులు విద్యార్థులే వసూలు చేసుకుని నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యకమాల్లో ఉపయోగించే డ్రెస్సులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు వేసుకునే డ్రస్‌లకు అద్దె ఈ డబ్బుల నుంచే చెల్లించారు. ఆ డబ్బులు ఎవరు నిరుపయోగం చేయలేదు. – డాక్టర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్, ఎంజీఎం ఆస్పత్రి -
ఐటీఐలో అక్రమ వసూళ్లు..
నిజామాబాద్‌అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అటెండెన్స్ పేరిట విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తూ ఒక్కొక్కరి నుంచి రూ.1000 చొప్పున గుంజుతున్నారు. కళాశాలలోనే బహిరంగంగా ఈ తంతు సాగుతోంది. వసూళ్ల బాగోతంలో ముఖ్యమైన అధికారులతో పాటు మరో నలుగురి ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. బాలుర ఐటీఐలో విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కాకపోవడంతో వారిని కళాశాలకు అనుమతించడం లేదు. వరుసగా మూడు నుంచి నాలుగు రోజులు రాని విద్యార్థులను గుర్తించి వారికి ఫోన్లో మీ అడ్మిషన్‌ను రద్దు చేస్తున్నామని సందేశం పంపిస్తున్నారు. అనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థులను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వసూళ్ల కార్యక్రమం చేపడుతున్నారు. నీ అడ్మిషన్ కొనసాగాలంటే హాజరు శాతం ఉండాలి, లేదంటే అడ్మిషన్‌ను కోల్పోతారు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తే హాజరు వేస్తామని చెబుతున్నారు. ఉన్నతాధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగిని వసూళ్ల కార్యక్రమానికి కేటాయించారు. రెండు నెలలుగా వ్యవహారం సాగుతోంది. సుమారు 200 మంది వరకు ఉన్న కళాశాలలో 100 మంది విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఈ అక్రమ వసూళ్లను భరించలేకపోయిన కొందరు విద్యార్థులు ఇటీవల సెల్ఫోన్లో చిత్రీకరించారు. సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ వసూళ్ల దందాను నిరోధించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
అనైతిక వైద్యం వెనుక అవినీతి చీకటి
వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమచర్యలలో భాగంగా కార్మిక జీవిత బీమా సంస్థ వారు (ఇఎస్ఐసి) అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. చిన్న ఉద్యోగులకు, కార్మికులకు అందులో చికిత్స ఉచి తంగా ఇస్తారు. ఒక్కోసారి వాటిలో అవసరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోతే వారే సమీపంలోని ప్రయివేటు వైద్యశాలలకు చికిత్సకోసం రోగులను పంపించవలసి ఉంటుంది. అక్కడి చికిత్సకు శస్త్ర చికిత్సలకు, రోగులకు అమర్చిన స్టెంట్ వంటి పరికరాలకు అయ్యే ఖర్చులను కార్మిక జీవిత బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యదుకాణాల వ్యాపారులు స్టెంట్ అనే పరికరాన్ని గుండెజబ్బుతో బాధపడేవారికి అమర్చినందుకు తీసుకునే డబ్బు విపరీ తంగా ఉంటుంది. వాటి అసలు ధరకు, వారు వసూలు చేసే సొమ్ముకు సంబంధమే ఉండదు. ప్రయివేటు ఆస్పత్రులకు ఇఎస్ఐసి పంపే రోగుల చికిత్సకు వాడే పరికరాలకు గాను చెల్లింపుల గందరగోళం గురించి ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖ లైంది. రెండో అప్పీలు రూపంలో ఆ సమస్య కేంద్ర సమాచార కమిషన్‌కు చేరింది. ఎవరైనా సరే చికిత్సకు వాడే వస్తువులకు ఇష్టం వచ్చినట్టు ధర విధించడానికి వీల్లేదని, ఇఎస్ఐసి వారు కేవలం సీజీహెచ్ఎస్ వారు నిర్ధారించిన ధరల ప్రకారమే రేట్లు వసూలు చేస్తారని సమాధానం ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి రేట్లప్రకారం కూడా చెల్లింపులు ఉంటాయి. ఇఎస్ఐ కూడా ధరలను నిర్ధారించింది. గుండె రోగులకు కార్డో వాస్క్యులార్ డెప్రిబిలేటర్ సింగిల్ చాంబర్, డబుల్ చాంబర్, సీఆర్‌టీపీ వస్తువులను, పేసర్లను అమర్చుతూ ఉంటారు. అయితే ఇఎస్ఐ తాము పంపిన రోగులకు ఎంత ధర వసూలు చేస్తున్నారనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రయివేటు ఆస్పత్రుల వారు అడిగినంత డబ్బు ఇచ్చి, రేట్ల తేడాలు పట్టించుకోకుండా ఉండేందుకు ప్రతిఫలాలు అందుకుంటున్నారని దరఖాస్తుదారు పవన్ సారస్వత్ ఫిర్యాదు చేశారు. గుండె సింగిల్ చాంబర్‌కు వాడే ఐసీడీకి ఎయిమ్స్ వారు లక్షా 75 వేల 786 రూపాయలు ధర నిర్ణయిస్తే ఇఎస్ఐ పంపిన రోగులకోసం ప్రయివేటు వైద్యశాలలు 5 లక్షల 50 వేల నుంచి 8 లక్షల 50 వేల దాకా అడుగుతున్నారని, ఇఎస్ఐసి చెల్లిస్తున్నదని వివరించారు. కార్మికులు. చిన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, బీమా సొమ్మును ఆస్పత్రులు ఈ విధంగా దోచుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. అసలు ఈ విధంగా స్టెంట్లు వేయడం, ఖరీదైన చికిత్సలు చేయడం కూడా చాలా సందర్భాలలో అవసరం లేదని నిపుణులైన డాక్టర్ల మాట. అవసరం లేని కేసుల్లో కూడా సర్జరీలు చేస్తున్నారని, వారు సూచిం చిన చికిత్స వెంటనే చేయకపోతే ప్రాణాలుపోతాయని, అందుకు తాము బాధ్యులం కామని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు భయపెడితే ఏమీ తోచక భయపడి రోగులు స్టెంట్లు వేయించుకోవడానికి ఒప్పుకోక తప్పడం లేదని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హృదయాలయ) అన్నారు. సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఔషధ వైద్యంద్వారా గుండె జబ్బును నివారించే అవకాశం ఉంటే స్టెంట్ వాడకూడదని అన్నారు. అవసరం లేకపోయినా స్టెంట్ వాడితే అది చాలా తీవ్రమైన అనైతిక చర్య అని వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. అసలు ఇఎస్ఐ వారు ఎందుకు వేలాది మంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపించేస్తున్నారనేది ప్రశ్న. రెండున్నర రెట్లకన్న ఎక్కువ ధరను స్టెంట్లకు చెల్లించాల్సి వస్తోందని వారికీ తెలుసు. ఇఎస్ఐ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆరోగ్య శాఖ వారికి గానీ ఈ సంగతులు వివరించి, ఈ దారుణమైన దోపిడీని ఆపడానికి కనీసం ప్రయత్నించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు కారణం ప్రయివేటు ఆస్పత్రులనుంచి వీరికి క్రమం తప్పకుండా ఒక్కో స్టెంట్‌కు కొంత కమీషన్ చొప్పున సొమ్ము అందుతున్నదని, రోగులను తమకు రిఫర్ చేసినందుకు ఇఎస్ఐసి వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారని అన్నారు. వీరి లంచం డబ్బులు కూడా కలుపుకుని, దానికిపైన కూడా తమ లాభాన్ని తగిలించి, రోగులనుంచి, బీమా కంపెనీలనుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆస్పత్రులు వెనుకాడడం లేదని ఆయన వివరించారు. చర్యతీసుకునే వారెవరు? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
అక్రమ వసూళ్ల కేసులో నయీం భార్య అరెస్టు
సాక్షి, యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం భార్య హసీనా బేగంను భువనగిరి పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఆమె 15 అక్రమ వసూళ్ల కేసుల్లో నిందితురాలిగా ఉన్నట్లు భువనగిరి టౌన్ ఎస్సై ఎం.శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హసీనా బేగంను భువనగిరిలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్‌సీఎం) కోర్టులో హాజరు పరిచామని ఆయన వెల్లడించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలుగా నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు పేర్కొన్న ఐటీ అధికారులు గతేడాది వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
బెదిరించి దోచేయడమే
ఆగని నకిలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లీలలు మూడు జిల్లాల్లో అనధికార తనిఖీలు ఇప్పటికే పలు పోలీస్స్టేషన్లలో కేసులు ముఠాగా ఏర్పడి అక్రమ వసూళ్లు మర్రిపాలెం : కనిపించిన వాహనాన్ని ఆపడం.. పత్రాలు చూపించండి.. కారులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అని బెదిరించడం.. ఆనక ఓ రేటు మాట్లాడుకుని దోచుకోవడం.. ఇలా సాగిపోతోంది ఓ ప్రబుద్ధుడి నిర్వాకం. పలుమార్లు పోలీసులకు చిక్కినా.. కేసులు నమోదు చేసినా అతని ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఏకంగా ఓ ముఠా తయారుచేసి తనిఖీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల కిందట విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో తనఖీలు చేపడుతూ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పగలు డ్రైవింగ్... రాత్రుళ్లు తనిఖీలు ఇసుకతోట ప్రాంతానికి చెందిన గోవింద్ ఒకప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కారుకు డ్రైవర్‌గా పనిచేశాడు. సదరు అధికారి కారును తన ఇంటి వద్ద ఉంచుతానని చెప్పి తీసుకుపోయేవాడు. రాత్రి వేళ ఆ కారుతో రహదారులపై తనిఖీలకు తెరలేపాడు. ‘రవాణా శాఖ’ పేరుతో కారు చూసిన వారంతా నిజమని నమ్మేవారు. కారులో ఓ మహిళను ఉంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అని నమ్మిస్తూ ఎడాపెడా దోచేసేవాడు. ఉదయం మరలా యధావిధిగా విధులకు వచ్చేవాడు. తనిఖీల విషయం సదరు అధికారికి తెలియడంతో ఉద్యోగం ఊడింది. మరో అధికారి వద్ద గోవింద్ మళ్లీ డ్రైవర్‌గా చేరాడు. అక్కడ కూడా అదే తరహాలో వ్యవహరించడంతో ఉద్యోగం పోయింది. ఇదంతా రెండేళ్ల క్రితం మాట. గోవింద్ కోసం గాలింపు నకిలీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చెలామణీ అవుతోన్న గోవింద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోవింద్ పట్టుబడితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో పలువురు అధికారుల వద్ద పనిచేసిన గోవింద్ తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడేవాడని తెలిసింది. అధికారులను బ్లాక్మెయిల్ చేయడంలో దిట్టగా చెబుతున్నారు. నమ్మకంగా ఉంటూ తన అసలు రూపం చూపేవాడని సమాచారం. అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం చెబుతానని బెదిరించి డబ్బులు దోచుకోవడంలో దిట్టగా రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు దోచిన గోవింద్ ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టాలని, మరోసారి నకిలీ అధికారిగా కనిపించకుండా కఠినంగా శిక్షించాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు. సొంతంగా కారు... ఓ ముఠా అప్పటికే దోచుకున్న డబ్బుతో గోవింద్ సొంతంగా కారు కొన్నాడు. ఏకంగా ఓ ముఠా తయారుచేశాడు. రోడ్డు మీద కాపు గాచి తనిఖీలకు ఉపక్రమించాడు. లారీలు ఆపి రికార్డులు తనిఖీ చేయడం, కేసులు నమోదు చేస్తానని బెదిరించి డబ్బులు గుంజేవాడు. అయితే ఆయా ప్రాంతాల్లో గోవింద్ ఆగడాలను పోలీసులు పసిగట్టారు. విజయనగరం జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్లలో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. మూడు నెలల క్రితం చోడవరం ప్రాంతం చీడికాడలో తనిఖీలు జరిపి మరలా దొరికిపోయాడు. గోవింద్‌తో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నమ్మించిన మహిళను, మరో ఇద్దరిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెల రోజుల తర్వాత బెయిల్ మీద విడుదలైన గోవింద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరలా తనిఖీలు ప్రారంభించాడు. మూడు రోజుల క్రితం భోగాపురం ప్రాంతం సుందరపేటలో ఓ లారీ డ్రైవర్‌ను బెదిరించాడు. తాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా తెలిపి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని డ్రైవర్ చెప్పడంతో రూ.3 వేలకు బేరం కుదిరింది. అయితే డ్రైవర్ అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భోగాపురం సీఐ నర్సింహరావు నేతృత్వంలో కారు అదుపులోకి తీసుకున్నారు. అందులోని ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా గోవింద్ తృటిలో తప్పించుకున్నాడు. లారీ డ్రైవర్ వద్ద డబ్బు వసూలు విషయం వాస్తవమని పోలీసులు తేల్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. -
మానవహక్కుల సంఘం పేరిట వసూళ్లు
- నలుగురు అరెస్ట్ సుల్తానాబాద్: మానవహక్కుల సంఘం పేరిట ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలను గత కొన్ని రోజులుగా ఓ ముఠా మానవ హక్కుల సంఘం పేరిట వేధింపులకు గురిచేస్తూ.. అక్రమంగా చందాలు వసూలు చేస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తుల ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ విజయేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. -
టీపీ తలనొప్పి!
► అక్రమాల నివారణకు అమల్లోకి నూతన విధానం ► డ్రైవర్లు, ట్రాన్స్పోర్టర్లలో అవగాహన లోపంతో సమస్యలు ► చెక్‌పోస్టు వద్ద రోజుల తరబడి నిలిచిపోతున్న బ్లాక్‌లిస్టు వాహనాలు బీవీపాళెం(తడ): యూజర్ చార్జీల పేరుతో లారీ సిబ్బంది నుంచి చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడటాన్ని అరికట్టేందుకు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు టీపీలను ఆన్లైన్ ద్వారా తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనంతోపాటే ఈ వేబిల్లులు, ఈ టీపీలు తెచ్చుకోవడం వల్ల వాహనదారులు ఎక్కువ సమయం చెక్‌పోస్టులో ఆగకుండా వెళ్లేలా సమయం కలిసి వస్తుందని భావించారు. కానీ ప్రస్తుత ం ఈటీపీల వల్ల బ్లాక్‌లిస్టు వాహనాల సంఖ్య పెరుగుతూ, చిన్నచిన్న తప్పులు, తమకు సంబంధంలేని తప్పుల కారణంగా కూడా వాహనాలు రోజుల తరబడి నిలిచిపోతూ ఉండటంతో వాహనాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇలా.. గతంలో రూ.50 యూజర్ చార్జీ తీసుకుని చెక్‌పోస్టు డీఈఓలు(డేటా ఎంట్రీ ఆపరేటర్లు) డ్రైవర్లు ఇచ్చే, తెచ్చే సమాచారం ఆధారంగా తమ వ్యక్తిగత లాగిన్‌లో పొరపాట్లు లేకుండా టీపీలు నమోదు చేసేవారు. తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే వెంటనే సవరించుకునే వెసులుబాటు ఉండేది. వాహనం నంబరులో పొరపాట్లు, ఎగ్జిట్ చెక్‌పోస్టు దాటే సమయంలో లోపాలను సరిదిద్దే అవకాశం ఉండేది. ఏప్రిల్ 1 నుంచి వచ్చిన నూతన విధానంతో ఈటీపీలు స్వయంగా తయారు చేసుకుని రావాల్సి వచ్చింది. అవగాహనలేని ట్రాన్స్పోర్టర్లు, డ్రైవర్లు చెక్‌పోస్టుకు వచ్చి అక్కడ ఉన్న ప్రైవేటు ఆన్లైన్ సెంటర్లలో ఈటీపీలు నమోదు చేయించుకుంటున్నారు. ఈ సమయంలో హడావిడి, డ్రైవర్లు ఇచ్చే సమాచారం లోపం ఉండటం వల్ల తప్పులు అధికంగా వస్తూ బ్లాక్‌లిస్టుకి కారణం అవుతున్నాయి. తమిళనాడుకి వెళ్లేందుకు తిరువూరులో ఎగ్జిట్ కావాల్సిన వాహనదారుడు అవగాహన లేకుండా చెన్నై వైపు ఎగ్జిట్ అయితే ఆవాహనం బ్లాక్ లిస్టులో పడిపోతుంది. గతంలో ఎగ్జిట్ చెక్‌పోస్టు మారినా సమయం, ఇతర వివరాలు పరిశీలించి డీఈఓ లాగిన్ ద్వారా వెళ్లే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఏ చెక్‌పోస్టుపేరు నమోదు చేస్తే అక్కడే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంది. కానీ అవగాహన లేని డ్రైవర్లు ఇచ్చే సమాచారంతో అవగాహన లేని నెట్ సెంటర్ల వారు తయారుచేసే ఈటీపీల కారణంగా బ్లాక్ లిస్టు పెరిగిపోతోంది. బీవీపాళెం చెక్‌పోస్టులో రెగ్యులర్ ఏఓ లేకపోగా ఇన్చార్జ్ ఏఓ సెలవుపై వెళ్లడంతో వాహనాల బ్లాక్ లిస్టులు పెరిగి పోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఈటీపీలపట్ల అవగాహన పెంచుకునే వరకు అధికారుల సహకారంతో మీసేవ తరహాలో ఓ సెంటర్‌ని ఏర్పాటు చేసి తప్పులు లేని ఈటీపీలను తయారు చేసి ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి డీసీ కృష్ణమోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
మద్యం డిపోలో ‘వసూళ్ల కిక్కు’
► నెలకు రూ.4లక్షల పైమాటే.. ► లారీ అన్లోడ్కు రూ.200 ► టెంపరరీ పర్మిట్‌కు రూ.100 ► బిల్లింగ్‌కు రూ.100 వసూలు జిల్లాలోని మద్యం డిపోలో వసూళ్ల దందా కొనసాగుతోంది. ఇది ఏకంగా నెలకు రూ.నాలుగు లక్షలకుపైమాటే. మద్యం డిపోకు లోడ్‌తో లారీ వచ్చిందా ఇక అంతే.. లారీకి రూ.200, టెంపరరీ పర్మిట్ జారీ చేస్తే రూ.100, బిల్లింగ్ చేస్తే రూ.100 చొప్పున బ్రెవరేజీ కంపెనీల నుంచి డిపో అధికారులు బెదిరింపులకు పాల్పడి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. ఈ అక్రమ దందాను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమదందా వ్యవహారం నెలకు ఎంత లేదన్నా.. రూ.నాలుగు లక్షలపైగానే ఉంటోందని సమాచారం. కరీంనగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని మద్యం డిపోకు వివిధ రకాల మద్యం కంపెనీలు వారివారి మద్యాన్ని పంపిస్తుంటారు. ప్రతినెలా 25 రోజుల్లో సుమారు 600 లారీలు మద్యంతో వస్తుంటారుు. లారీ సకాలంలో డిపోలోకి వెళ్లి.. మద్యం అన్లోడ్ చేయూలంటే సంబంధిత డిపో అధికారులకు రూ.200 ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే సదరు లారీని రోజులతరబడి బయటనే ఉంచుతున్నారు. దీంతో చేసేది లేక కంపెనీ ప్రతినిధులు రూ.200 చెల్లించి మద్యాన్ని అన్లోడ్ చేరుుంచుకుంటున్నట్లు సమాచారం. ఇలా లారీలను డిపోలోకి అనుమతించడం ద్వారానే డిపో అధికారులకు సుమారు రూ.1.20 లక్షలు అనధికారికంగా సమకూరుతున్నట్లు తెలుస్తోంది. లారీ లోపలికి రావడంతో మొదలైన ఈ దందా.. మద్యం దుకాణాలకు వెళ్లేవరకూ ప్రతి దశలో కొనసాగుతూనే ఉంటుంది. టెంపరరీపర్మిట్ జారీ చేయూలంటే రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈలెక్కన ప్రతిరోజూ డిపోకు 80 నుంచి 100 వరకు లారీలు వస్తాయని అనుకున్నా.. రోజుకు రూ.10 వేలు, నెలకు రూ.మూడు లక్షలు దాటుతారుు. ‘వసూళ్ల’కు ప్రైవేట్ వ్యక్తులు.. మద్యం డిపోలో ఈ మామూళ్ల వసూలుకు ముగ్గురు ప్రైవేట్ సిబ్బంది పనిచేస్తున్నారని తెలిసింది. బీర్లతో వచ్చిన లారీల నుంచి వసూలుకు ఒకరు.. లిక్కర్ లారీ నుంచి వసూలుకు ఇద్దరు పనిచేస్తున్నారని సమాచారం. వీరు ప్రతిరోజూ వసూలు చేసిన మొత్తాన్ని సంబంధిత అధికారికి అప్పగిస్తారని తెలిసింది. వీరితోపాటు మరో ముగ్గురు పనిచేస్తున్నారని, వారికి నెలకు రూ.12 వేల చొప్పున వేతనం రూపంలో చెల్లిస్తుంటారని డిపోవర్గాల ద్వారా తెల్సింది. ఈ లెక్కన సంబంధిత వ్యాపారులు ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల దందాను దర్జాగా కొనసాగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఉన్నతాధికారులకు తెలిస్తే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘వారికి నెలనెలా మామూళ్లు వెళ్తుంటారుు. వారు ఇటువైపు కన్నెత్తి చూడరు. వచ్చినా మమ్మల్ని ఏం చేయరు..’ అని ఓ అధికారి బహిరంగంగానే పేర్కొంటున్నాడని సదరు వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా.. జిల్లాలో ఉన్న మద్యం డిపోకు చైర్మన్‌గా జారుుంట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. అరుుతే మద్యం డిపోలో పనిచేస్తున్న అధికారులపై అజమాయిషీ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రచారంలో ఉంది. డిపోలో పనిచేస్తున్న ఓ అధికారి వారం లో మూడు రోజులు డిపోలో ఉంటాడని.. మిగిలిన మూడు రోజుల సొంత పనులపై వెళ్తుంటాడని, ఎవరైనా అధికారులు అకస్మాత్తుగా తనిఖీ చేస్తే ‘ఇప్పుడే.. బయటకు వెళ్లాడ’ని చెబుతుంటారని పలువురు గుర్తుచేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి డిపో జరుగుతున్న అక్రమ వసూళ్లపై దృష్టి సారించాలని పలువురు మద్యం వ్యాపారులు కోరుతున్నారు. -
డి‘స్కాం’!
డిస్కంలో అవినీతి దందా ఆదాయం వచ్చే ప్రాంతాలపై దృష్టి అధికారులకు భారీగా ముడుపులు వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు తాజాగా ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం ఏఈ అశోక్ సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీ ఎస్‌ఎస్‌పీడీసీఎల్) అక్రమార్కులకు నిలయంగా మారింది. ఏ పని చేయాలన్నా అధికారులు, సిబ్బందికి చేతులు తడపాల్సిందే. అపార్టమెంట్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలన్నా.... ఇంటి ముందు విద్యుత్ లైను వేయాలన్నా... ఇంటికి కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా... చివరకు కాలిపోయిన మీటర్ మార్చాలన్నా...లైన్మెన్ దగ్గరి నుంచి డీఈ వరకు అందరికీ ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. వినియోగదారులకు ఎంతో పారదర్శకంగా సేవలు అందించాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదనే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. పని చేసే ప్రాంతాలను ఫోకల్ (ఆదాయం వచ్చేవి), నాన్ ఫోకల్ (ఆదాయం అంతగా లేనివి) పోస్టులుగా విభజించి, వాటిని చేజిక్కించుకునేందుకు సంస్థలోని కొంత మంది‘పెద్ద’లకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని మళ్లీ కూడబెట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కోర్ సిటీ కంటే... కొత్త కనెక్షన్లు, లైన్లు అధికంగా అవసరం ఉన్న శివారు ప్రాంతాల్లో పని చేయడానికిఎక్కువ మొగ్గు చూపుతుండటానికి ‘అదనపు’ రాబడే కారణం. తీరు మార్చుకోరు... అవినీతి ఆరోపణలతో పాటు వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఇప్పటికే పలువురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అయినా మిగిలిన వారిలో మార్పు రావడం లేదు. హుస్సేన్‌సాగర్ ఎస్ఈగా పని చేసిన ఓ అధికారితో పాటు, మింట్ కంపౌండ్ ఏడీఈగా పని చేసిన మరో అధికారి.. వనస్థలిపురం ట్రాన్స్‌కో ఏడీ ఈలు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీకి పట్టుబడిన ఉదంతాలను సిటిజన్లు ఇంకా మరిచిపోలేదు. తాజాగా వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌కు చెందిన కాంట్రాక్టర్ కర్రి వెంకటేశ్వరరావు ఇటీవల విద్యుత్ కనెక్షన్ (6 సింగిల్ ప్యానల్ బోర్డు) కోసం దరఖాస్తు చేసుకోగా... అంచనాల కోసం ఏఈ అశోక్ రూ.30 వేలు డిమాండ్ చేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చే సమయంలో చెల్లిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం వారు వలపన్ని ఏఈని పట్టుకున్నారు. అక్రమార్కులు గుండెల్లో రైళ్లు ఆదాయానికి మించి ఆస్తులతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగుల్లో విద్యుత్ శాఖ రెండోస్థానంలో ఉండటం విశేషం. విద్యుత్ అధికారుల్లో చాలా మంది ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి ఇళ్లపై ఏసీబీ ఇటీవల వరుసగా దాడులు చేస్తోంది. ఇవి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ అధికారి ఇంటిపై ఏసీబీ కన్ను పడుతుందోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కూడబెట్టిన ఆస్తులను ‘సంరక్షించే’ పనిలో పడుతున్నారు. తమ పేరుపై ఉన్న రూ.కోట్ల విలువైన ఆస్తులను బంధువులకు అప్పగిస్తున్నారు. -
టిడిపి మంత్రిపై నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం: ఏపిలో టిడిపి మంత్రి, అతని అనుచరులపై చిన్న నిర్మాతల మండలి అధ్యక్షుడు నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టిడిపి మంత్రి, అతని అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2006-12 వరకు సర్వీసు ట్యాక్స్ మాఫీ చేయిస్తామంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో థియేటర్ యజమాని వద్ద 50 వేల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక టిడిపి మంత్రి, ఆయన అనుచరుడు అశోక్‌కుమార్, గోవిందరాజు అనే మధ్యవర్తి కలిసి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు వివరించారు. వారితోపాటు ఎన్వీ ప్రసాద్, పూర్వీ రాజు, చిన్ని, జనార్ధన్, అలంకార్ ప్రసాద్‌లు కూడా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించారు. అవినీతిని నిర్మూలిస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవినీతిని ఎందుకు అడగటంలేదని ఆయన ప్రశ్నించారు. 24 గంటల్లోగా వసూళ్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. -
పైసలివ్వకుంటే.. ఫెయిలే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రభుత్వ ఐటీఐలో పైసా ఖర్చు లేకుండా రెండేళ్లు కోర్సు పూర్తిచేస్తే ఉ ద్యోగం వస్తుందన్న ఆశపడే పేద విద్యార్థులను దురాశాపరులు సొమ్ముల కో సం పీడిస్తున్నారు. కాకినాడలోని ప్రభు త్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఐటీఐలో రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్లలో కొందరు చేస్తున్న దందాపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీఐ రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 15న థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుమా రు 238 మంది ఇన్‌స్ట్రమెంటల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి పది ట్రేడుల్లో పరీక్షలు రాస్తున్నారు. ఏటా ఈ పరీక్షల సమయంలో కొందరు ఇన్స్ట్రక్టర్లు సొమ్ములు గుంజడం ఆనవాయితీగా మారిందని, ఈ ఏడాది కూడా ఒక్కో పేపర్‌కు రూ.2000 వంతున వసూలు చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు వారం ముందు నుంచే.. పరీక్షలు మొదలు కావడానికి వారం ముందుగానే కొందరు ఇన్స్ట్రక్టర్లు వసూళ్ల బాధ్యతను తమకు అనుకూలురైన కొందరు విద్యార్థులకు అప్పగిం చారు. అక్రమ వసూళ్ల లక్ష్యం రూ.20 లక్షల పైమాటే. రెండో సంవత్సరంలో ఒక్కో విద్యార్థీ రెండు థియరీ, రెండు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలి. పేపర్‌కు రూ.2000 వంతున నాలుగింటికి రూ.8000 వసూలు చేశారని తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు. ఈ ఐటీఐలో చదువుతున్న వారంతా పేదకుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులే. 100 మార్కులున్న థియరీ పేపర్‌కు 40 పాస్ మార్కులు. మిగిలిన మూడు పేపర్లు ఒక్కొక్కటి 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక్కో పేపర్‌కు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్టే. ఇవి కాక ప్రాక్టికల్స్‌లో 300 మార్కులకు 180 వస్తే ఉత్తీర్ణులైనట్టే. విద్యార్థులు అభ్యసించేది ఏ ట్రేడ్ అయినా ఉత్తీర్ణతా మార్కులు మాత్రం మారవు. ఇన్స్ట్రక్టర్లు ఎక్కడ ఉత్తీర్ణతకు అడ్డుపడతారోనని అప్పులు చేసి అడిగినంతా సమర్పించుకున్నామని పేర్లు చెప్పడానికి భయపడుతున్న కొందరు తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపా రు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులోనైనా ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందన్న ఆశతోనే ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. వసూళ్లు వాస్తవమైతే చర్యలు : ప్రిన్సిపాల్ వసూళ్ల విషయమై ఐటీఐ ప్రిన్సిపాల్ డి.భూషణంను వివరణ కోరగా విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. బ లవంతపు వసూళ్లపై విద్యార్థులు ఫి ర్యాదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిం చగా.. విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. ఐటీఐ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.