హరితహారం కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజాప్రతినిధులందరినీ సమన్వయం చేసుకుని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ సూచించారు.
విద్యాలయాలు, ప్రభుత్వకార్యాలయాలు, మార్కెట్ యార్డులు, ఖాళీ ప్రదేశాలతోపాటూ రహదారుల వెంట వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.