చదువు‘కొన’గలమా? | An increase in fees on the students concerned to work | Sakshi
Sakshi News home page

చదువు‘కొన’గలమా?

Published Tue, Jan 19 2016 1:42 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

An increase in fees on the students concerned to work

ఫీజుల పెంపు కసరత్తుపై విద్యార్థుల ఆందోళన
ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి

 
రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు పెంచడానికి కసరత్తు చేస్తోంది. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజుల పెంపుపై పలువురు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. తమ కుటుంబాలపై ఆర్థిక భారం పడి చదువు మధ్యలోనే ఆపివేసే పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాండా పేద, మధ్య తరగతి వర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మిగలనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని వారు కోరారు.
 
విద్య అందరికీ అందుబాటులో ఉండాలి ప్రభుత్వాలు ఉన్నత విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే అభివృద్ధి చెంద దు. అయితే పెంచుతున్న ఫీజులతో కొందరికే విద్య అందే పరిస్థితి నెలకొంటుంది. దీంతో నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.      - సుష్మ, బీఫార్మసీ బిట్స్, నర్సంపేట
 
పేద విద్యార్థులపై భారం పడుతుంది
 ఇంజనీరింగ్ ఫీజులు పెంచుతున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నా యి. ఇప్పటికే పేద విద్యార్థులపై ఫీజుల భారం పడుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజులు పెంచుతామని చెబుతూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు.  
 
 - టి. ప్రశాంత్, బీటెక్, వాగ్దేవి కళాశాల
 
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి
అందరికీ ఆమోదయోగ్యమైన ఫీజులు ఉండాలి. ఫీజులు పెంచాలని ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకోవాలి.  దీని వలన పేద విద్యార్థులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.
 కె. సాయి ప్రణీత, బీటెక్, కిట్స్
 
ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఫీజులు నిర్ణయించాలి
విద్యార్థి కుటుంబ పరిస్థితుల ఆధారంగా ఫీజులు నిర్ణయించాలి. ఫీజు లుపెంచడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడం  కష్టం. తల్లిదండ్రులు సైతం డబ్బులు కట్టలేని పరిస్థితి.
 టి. స్నేహిత, బీటెక్, కిట్స్
 
మెరుగైన సదుపాయూలు కల్పించాలి
ఫార్మసీ విద్యార్థులకు ప్రభుత్వ,  ప్రైవేట్ కళాశాలల్లో మెరుగైన సదుపాయూలు అందుబాటులో ఉంచేం దుకు చర్యలు తీసుకోవాలి. ఫీజుల పెంపుదలపైనే ప్రభుత్వాలు దృష్టి సారించడం వలన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతారుు. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి ఫీజుల పెంపు విషయాన్ని విర మించుకోవాలి.-సంజన, బీ.ఫార్మసీ, బిట్స్, నర్సంపేట
 
ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే కుట్ర
 రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించడంలేదు. కళాశా ల ఫీజులు చెల్లించాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చే ఏడాది నుంచి 15 శాతం మేర ఫీజులు పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేల పెంచితే ఇం జనీరింగ్ విద్యకు పేదలు  దూరం అవుతారు. - ప్రశాంత్, బీటెక్ ఫైనల్ ఇయర్, వాగ్దేవి కళాశాల
 
అభిప్రాయాలు సేకరించాలి

 ప్రభుత్వం ఫీజులు పెంచే ముందు కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థులు ఫీజు లు చెల్లించే స్థోమత ఉందా లేదా అనే అభిప్రాయాలు సేకరించాలి.  
 -నైమిషా, బీటెక్. కిట్స్
 
చదువుకొనే పరిస్థితులు వస్తున్నాయి

 ప్రస్తుతం చదువు కోవడం కాదు...చదువుకొనే పరిస్థితులు వస్తున్నాయి.  డబ్బులు ఉన్నవారికి ఉన్నత విద్య అందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఫీజులు నిర్ణయించాలి.
 -నాగమల్ల సుధీష్, బీటెక్, కిట్స్
 
ఫీజుల పెంపును విరమించుకోవాలి
 కాలేజీ ఫీజు పెంచితే ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. దీంతో నాలాంటి పేద విద్యార్థులు ఇంజినీరింగ్ చదవడం కలగానే మారుతుంది. ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఫీజు పెంపును విరమించుకోవాలి.
- దార ధనుంజయ్, బీటెక్  
 
ప్రభుత్వం పునరాలోచించాలి
ఫార్మసీ కళాశాలల్లో ఫీజులు పెంచాలనే నిర్ణయూన్ని ప్రభుత్వం పునరాలోచించాలి. ఇప్పటికే చెల్లిస్తున్న ఫీజులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుండగా అదనంగా పెంచాలనే నిర్ణయుం సరికాదు.
  -గాదె వునీషా, బీఫార్మసీ,
  బిట్స్ నర్సంపేట
 
 నిరుపేదలకు భారం
ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు పెంచితే నిరుపేద విద్యార్థులకు భారం అవుతుంది. అన్ని వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారు. అందుకే ఫీజు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ నలు చేస్తాం.
 - చకిలం సంతోషి, బీటెక్, ఎస్సార్ కళాశాల     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement