ఏలూరి రామచంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్స్ ఓట్లపై ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలు కన్నేశారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రాంత ఓట్లు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గల్లో పోటీ చేసేందుకు ఏపీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి కూకట్‌పల్లి స్థానం నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే ఏలూరి.. కూకట్‌పల్లి నుంచి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ ఇటీవల అధిష్టానాన్ని కలిశారు. 2014 ఎన్నికల్లో ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పోటీ చేసి మూడుస్థానంలో నిలిచారు. ఈ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పోటీచేసి ఓటమిపాలైయ్యారు.
తాజాగా ఆయన కూకట్‌పల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మహాకూటమి నుంచి ఆయనకు తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ నేత ఇనగాల పెద్దిరెడ్డి కూటమి తరుఫున తనకే టికెట్ కేటాయించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో సెటిలర్స్‌కు స్థానాలు కేటాయించాలని ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం అదేశించినట్లు సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లు పలు ప్రాంతాల్లో ఉన్నందున ఏదో ఒక స్థానంలో వారికి సీటు దక్కే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ గతంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment