
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇటీవలే యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
కరోనా అప్‌డేట్ : 7900 దాటిన మృతుల సంఖ్య
మొదట చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా లక్షా 90 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,900 మందికి పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 వేల మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 137కు పైగా నమోదుకాగా ముగ్గురు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment