
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం కూల్చివేత పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సచివాలం భవనాలను కూల్చి వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. ఇప్పటి వరకు నాలుగు పిటిషన్‌లపై వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అగ్ని ప్రమాదాలు జరిగితే నివారణ చర్యలు తీసుకోలేకపోతున్నామని, భవనాలు నీరుగారుతున్నయన్న కారణంతో నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూల్చి, తిరిగి కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని పిటిషనర్ల తరఫు న్యామవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి కుంటిసాకులు చెప్పి భవనాల్ని కూల్చేయకూడదని చెప్పారు. కొత్తగా సచివాలయాన్ని నిర్మించేందుకు రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ఖర్యు చేయాలనే ప్రతిపాదన అమలు జరిగితే ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. సచివాలయ భవాల్ని కూల్చరాదని కోరుతూ కాంగ్రెస్ట్ పార్టీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహఙత వ్యాఖ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.
గ్రామాల్లో మరుగుదొడ్లు దూరంగా ఉన్నాయని చెప్పి ఇళ్లను కూల్చేస్తారా లేక మరుగుదొడ్లను కూల్చేస్తారా అని న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి పిల్ వేయకూడదని ఎలా చెబుతారని, ప్రజాధనం వృథా అవుతుంటే పిల్స్ వేయడం పౌరునిగా ఆయన బాధ్యతని చెప్పారు. పిల్స్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం చెప్పడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని వృథా చేయడమంటే నేరానికి పాల్పడినట్లేనని, ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలలు జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయని సత్యంరెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీ సచివాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందనది, పాతబడిందని చెప్పి ఒక్క ఇటుకను కూడా తొలగించలేదన్నారు.
అదేవిధంగా చార్మినార్‌ను నిర్మించి 400 ఏళ్లకు పైబడిందని, ఇలాంటి చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేయాలేగానీ కూల్చేసి మళ్లీ కట్టేస్తామనడం అవివేకమని వ్యాఖ్యానించారు. సచివాలయాన్ని ఖాళీ చేయడం వల్ల పాలన అంతా తలోచోటుకు చేరిందని, సీఎం ప్రగతి భవన్‌లో ఉంటే ఇతరులు వేరువేరు భవనాల నుంచి పాలన చేస్తున్నారని చెప్పారు. ప్రధాన కార్యదర్శి కార్యలయాన్ని బీఆర్‌కే భవనంనలో ఏర్పాటు చేశారని, హుస్సేన్‌సాగర్ కనపనడేందుకు ఏకంగారూ. 6 కోట్లు ఖర్చు చేశారని, ఆ సీఎస్ ఉన్నది కేవలం ఆరేడు మాసాలేనని అన్నారు. ఎంపీ రేవంత్‌రెడ్డి, తరఫున న్యాయవాది రజనీకాంత్, విశ్వేశ్వరరావు తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌లు వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment