ఆ రెండూ టీఆర్‌ఎస్‌కే..! | Attempt to capture the exception of the five Bhainsa | Sakshi
Sakshi News home page

ఆ రెండూ టీఆర్‌ఎస్‌కే..!

Published Sun, Jun 29 2014 12:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఆ రెండూ టీఆర్‌ఎస్‌కే..! - Sakshi

ఆ రెండూ టీఆర్‌ఎస్‌కే..!

- కాంగ్రెస్ ఆధిక్యమున్న మంచిర్యాల, బెల్లంపల్లిపైనా కన్ను
 - చేతులెత్తేసిన కాంగ్రెస్ ముఖ్య నేతలు
 - భైంసా మినహా ఐదింటినీ కైవసం చేసుకునే యత్నం
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వరుస విజయాలు.. పార్టీలో చేరికలతో జోరుమీదున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ఆధిక్యమున్న బల్దియాలపై కూడా కన్నేసింది. కేవలం హంగ్ ఫలితాలొచ్చిన మండల పరిషత్‌ల్లోనే కాకుండా, నామమాత్ర కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురవేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు క్యాంపుల నిర్వహణతోపాటు, ఇతర పార్టీల కౌన్సిలర్లను తమవైపు లాక్కుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సామ, ధాన, బేధ దండోపాయాలను ప్రయోగిస్తోంది.

ఆరు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల, బెల్లంపల్లి బల్దియాల్లో కాంగ్రెస్‌కు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు దక్కాయి. ముఖ్యంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. చైర్మన్ స్థానానికి అవసరమైన మెజారిటీ 18 కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి. టీఆర్‌ఎస్ 14 స్థానాలకు పరిమితమైంది. కానీ.. ఇక్కడ మెజారిటీ లేని టీఆర్‌ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.

ఇప్పటికే క్యాంపునకు తరలివెళ్లిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు.. మరో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. శనివారం కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్యాంపునకు వెళ్లినా.. ఈ క్యాంపులో కేవలం 14 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ క్యాంపు నుంచి వెళ్లిపోయిన కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
బెల్లంపల్లిలోనూ..
బెల్లంపల్లి బల్దియాలో 34 వార్డులుండగా, కాంగ్రెస్ 14 కౌన్సిలర్ స్థానాలను, టీఆర్‌ఎస్ పది గెలుచుకుం ది. టీడీపీకి ఐదు దక్కగా, రెండు చోట్ల సీపీఐ, ముగ్గు రు స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ స్థానం దక్కాలంటే 18 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. అయి తే.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కే ఈ చై ర్మన్ పదవి దక్కాల్సి ఉండగా, పది స్థానాలకు పరిమితమైన అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ స్థానం కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

స్థానిక ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షణలో టీఆర్‌ఎస్ కౌ న్సిలర్లతో క్యాంపు కొనసాగుతుండగా, టీడీపీ, సీపీఐ కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్సే అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల కౌన్సిలర్లు కూ డా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.
 
చేతులెత్తేసిన కాంగ్రెస్ నేతలు..
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ఉద్ధండులు బల్దియా ఎన్నికల విషయంలో చేతులెత్తేశారు. వారి నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీలను కూడా ఆ నేతలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మంచిర్యాలలో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ఏకతాటిపై నిలపడంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అరవింద్‌రెడ్డి దాదాపు చేతులెత్తేశారు. అలాగే బెల్లంపల్లి చైర్మన్ స్థానాన్ని ‘హస్త’గతం చేసుకునేందుకు ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

భైంసా మినహా..
జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, మందమర్రి మినహా ఆరు బల్దియాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరింటిలో ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండాలు ఎగుర వేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ స్థానానికి సరిపడా మెజారిటీ రావడంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ బల్దియా గులాబీ వశం అవుతోంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనప్ప టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఒక్క భైంసా పట్టణంలో విజయం సాధించిన ఎంఐఎం చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement