- ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు
ఏటూరునాగారం : గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించే దిశగా అధికారులు పనిచేయూలని ఐటీడీఏ పీఓ జకనపల్లి సుధాకర్‌రావు అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశపు మందిరం లో ఐకేపీ, ఐసీడీఎస్, పశుసంవర్థక, ఇంజనీరింగ్, విద్య, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయ శాఖ సెక్టార్ అధికారులతో పీఓ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-15లో మంజూరైన ఎకనామికల్ సపోర్ట్ స్కీం ద్వారా లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలన్నారు. ఈనెల 10 వరకు లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, 25న మండలస్థాయిలో ఎంపీడీఓ, స్పెష ల్ ఆఫీసర్, బ్యాంకర్ల ఎంపిక, జూన్ 10న కలెక్టర్ ఆమోదం, జూన్ 20న ఎంపికైన లబ్ధిదారుల ఖాతాలోకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయన్నారు. జిల్లాలోని 51 మండలాలకు 8 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలి పారు. అలాగే వ్యవసాయ శాఖ కింద విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, డిప్‌ల్రు, నాగళ్లు ఇస్తారని, మైనర్ ఇరిగేషన్ కింద బోరు బావులు, ఓపెన్ వెల్‌కు మోటార్లు, పైపులైన్ మంజూరు చేస్తారని వివరించారు.
పశుసంవర్థక శాఖ కింద గొర్రెలు, పాడిగేదెలు, ఆవులు, మేకలు మంజూరు చేసి లబ్ధిదారులకు అం దిస్తున్నట్లు చెప్పారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద టెంట్‌హౌస్, కిరాణం, జిరాక్స్, ఫొటో స్టూడియో, కంగన్‌హాల్‌తోపాటు మరో 340 రకాల పథకాలు ఇందులో ఉన్నాయన్నారు. స్పెషల్ ఆఫీసర్లు లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు మొదటి అవకాశం కల్పించాలని ఆదేశించారు.
పనితీరు బాగోలేదు
ఏజెన్సీలోని అన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల పనితీ రు అధ్వానంగా ఉంది. స్థానికంగా అధికారులు ఉండడం లేదని పీఓ సీడీపీఎం రాజమణిపై మండిపడ్డారు. ఎక్కడ ఏ అధికారి తనిఖీ చేసిన తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో ఏ శాఖ అధికారి పనితీరుపై పర్యవేక్షణ చేసే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
కొందరు ఏటీడబ్ల్యూఓలు పనిచేయక ముందే చేసినట్లు, రికార్డులు పీఓ కార్యాలయానికి ఇవ్వకుండానే ఇచ్చినట్లు తప్పు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ వసంతరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ బీమ్‌రావు, ఐకేపీ ఏపీడీ రాజేంద్రప్రసాద్, డీపీఎంలు వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్, ఐసీడీఎస్ పీడీ కృష్ణజ్యోతి, ఏడీఏ మల్లయ్యగౌడ్, ఏఈ గంగాజమున, ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఏటీడబ్ల్యూఓలు జనార్దన్, నిర్మల, మణెమ్మ, రమాదేవి, మంగ్యానాయక్, డిప్యూటీ ఈఓ శ్రీరాములు, లీగల్ కోఆర్డినేటర్ దర్గయ్య పాల్గొన్నారు.
డెరురీ ఫాంల ఎంపిక
ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, కొత్తగూడ మండలాల్లోని 50 గ్రామాల్లో పాల ఉత్పత్తి కేంద్రాలు నెల కొల్పి రోజుకు 1,440 లీటర్ల పాలు తీసే విధంగా పైలట్ గ్రామాలుగా గుర్తించినట్లు ఏపీడీ రాజేంద్రప్రసాద్ పీఓకు వివరించారు. ఈ ఉత్పత్తి కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించి ఉత్పత్తి చేసిన పాలను ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధి ఫలాలు అందాలి.
Published Fri, May 8 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement