
ఆలోచన ఉంటే అవకాశాలెన్నో ఉన్నాయని నిరూపించాడీ యువకుడు.
కుత్బుల్లాపూర్ :ఆలోచన ఉంటే అవకాశాలెన్నో ఉన్నాయని నిరూపించాడీ యువకుడు. వేసవిలో చెరకు రసానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా తన ప్యాసింజర్ ఆటోను ఇలా చెరకు రసం బండిగా మార్చి ఉపాధి పొందుతున్నాడు జగద్గిరిగుట్టకు చెందిన మహిపాల్. ఆటో నడిపితే వచ్చే డబ్బులు ట్రాఫిక్ అధికారులు విధించే చలాన్‌లకే సరిపోతున్నాయని... ఆటోను ఇలా చెరకు రసం బండికి అమర్చడంతో చలాన్‌ల బెడద తప్పిందని పేర్కొన్నాడు. చింతల్ హెచ్‌ఎంటీ రోడ్డులో దీన్ని ఏర్పాటు చేశాడు.