
సాక్షి, హైదరాబాద్: భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డీ టీచర్స్ అసోసియేషన్ (ఆట) ఆధ్వర్యంలో నవంబర్ 10, 11 తేదీల్లో రవీంద్రభారతిలో జాతీయ స్థాయి ఆట బాలోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆట అధ్యక్ష, కార్యదర్శులు బెక్కంటి శ్రీనివాసరావు, మార్గం ఎల్లయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 5 వేల మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల కేజీ టు పీజీ వరకు చదివే విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు సమర్పించిన వారికి 26 అంశాలు, 47 విభాగాలు, 4 కేటగిరీల్లో వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. దరఖాస్తులను భద్రాచలంలోని ఆట క్యాంప్ ఆఫీస్, ఇంటి నం.9–1–168/15, శాంతినగర్ కాలనీ, భద్రాచలం– 507111, తెలంగాణ అడ్రస్‌కు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ataindia.ga వెబ్‌పేజీని లేదా 9848421589 (రమేశ్), 7981935477, 9396982375 (ఉమ) నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment