వారికి పునరావాసం కల్పించాలి.. హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ల వ్యవస్థపై నిషేధం విధించి, వారికి తగిన పునరావాసం కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దీనిని స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖల ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణలో బిచ్చగాళ్లు గౌరవప్రదంగా జీవించేలా చేయడంతో పాటు, వారి హక్కులను రక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. దేశవ్యాప్తంగా 7.3 లక్షల మంది యాచకులు ఉన్నారని, వారు ఏటా రూ.180 కోట్లు ఆర్జిస్తున్నారని, ఒక్క హైదరాబాద్‌లోనే 11 వేల మంది బిచ్చగాళ్లు రూ.15 కోట్లపైనే ఆర్జిస్తున్నారని వివరించారు.
బిచ్చగాళ్ల వ్యవస్థపై నిషేధం విధించాలి
Published Sat, Jun 7 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement