
దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారులపై సస్పెన్షన్‌తో ఏమీ కాదని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు.
దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కాగా మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.