అప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థి... ప్రభుత్వ కొలువు...
ఇప్పుడు ప్రజాప్రతినిధి అయ్యూరు. మహబూబాబాద్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎప్పుడూ బిజీగా ఉండే బానోత్ శంకర్‌నాయక్ స్థానిక ఏరియూ ఆస్పత్రి సమస్యలను తెలుసుకునేందుకు ఆదివారం ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారారు. 2 గంటల పాటు వార్డువార్డుకు తిరుగుతూ ఆస్పత్రి, రోగుల సమస్యలను తెలుసుకున్నారు. స్వైన్‌ఫ్లూ వార్డులో వైద్య సేవలను పరిశీలించారు. ఏరియూ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తానని, మానుకోటను బంగారు కోటగా మార్చడమే తన లక్ష్యమని బానోత్ శంకర్‌నాయక్ అన్నారు.
బానోత్ శంకర్ నాయక్ : ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ?
హరిలాల్ (రోగి తండ్రి) : ప్రధానంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. మినరల్ వాటర్ సౌకర్యం లేదు. జ్వరంతో బాధపడుతున్న నా కొడుకును ఆస్పత్రికి తీసుకొచ్చా. ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలి.
సూర్య (రోగి-అయోధ్య) : వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. కానీ, కింది స్థాయి సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. సెలైన్ బాటిల్ పెట్టిన తర్వాత ఇటు దిక్కే రారు. మందులు కూడా పూర్తిగా ఇవ్వడం లేదు.
వీరయ్య (రోగి-బలపాల) : రోగుల సంఖ్య పెరిగినప్పుడు ఒకే బెడ్డును ఇద్దరికి కేటాయిస్తుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాకు శరీరం నిండా పొక్కులు, ఇతరత్ర సమస్యలున్నాయని కొన్ని నెలలుగా తిరుగుతున్నా... ఆ వ్యాధి నయం కావడం లేదు. వైద్యులు సరియైన చికిత్స చేయడం లేదు.
కందయ్య (రోగి- సుదనపల్లి) : మరుగుదొడ్లు అధ్వానంగా ఉంన్నారుు. దుర్వాసన భరించలేకపోతున్నాం. వార్డులు కొంత మేర శుభ్రంగానే ఉంటున్నాయి. దోమల బెడద కూడా అధికంగా ఉంది.
శంకర్ నాయక్ : కరెంటు సమస్య ఉందా ?
నరేష్ (రోగి-సూర్యతండా) : కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్లతో కొన్ని వార్డులకు మాత్రమే కరెంటు వస్తోంది. మిగిలిన వార్డులు అంధకారంలోనే ఉంటున్నాయి. ఆస్పత్రిలో పలుమార్లు దొంగతనాలు జరిగాయి. అన్ని వార్డులకు కరెంటు ఉండేలా చర్యలు చేపట్టాలి.
శంకర్ నాయక్ : ఆస్పత్రిలో ఇంకా ప్రధాన సమస్యలు ?
శ్రీను (రోగి-మానుకోట) : బ్లడ్ బ్యాంక్ లేదు. అంబులెన్స్ సేవలు అందడం లేదు. అడిగితే మరమ్మతుకు వచ్చిందని చెబుతున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో సిబ్బంది, వైద్యుల కొరత ఉంది.
శంకర్ నాయక్ : స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా ఆస్పత్రిలో చర్యలు చేపట్టారా ?
శంకర్ (రోగి-మానుకోట) : వివిధ రకాల వ్యాధులతో ఆస్పత్రికి రాగానే సిబ్బంది ముందుగానే స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా మాస్కులను ఇస్తున్నారు. ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
శంకర్ నాయక్ : మత్తు డాక్టర్ సమస్య ఏమైనా ఉందా ?
రోగి వెంకన్న : ఒకే మత్తు డాక్టర్ ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ఆ డాక్టర్ సెలవులో ఉంటే అంతే సంగతులు. తక్షణమే మరో మత్తు డాక్టర్‌ను నియమించాలి.
శంకర్ నాయక్ : స్పెషల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ) సేవలు ఎలా ఉన్నారుు ?
మధుసూదన్ రావు (పిల్లల వైద్యుడు) : పిల్లల సంరక్షణ కోసం రూ. 65 లక్షల వ్యయంతో ఎస్‌ఎన్‌సీయూ నిర్మాణం జరుగుతోంది. అందుబాటులోకి వస్తే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.
శంకర్ నాయక్ : ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోందా ?
జగదీశ్ (ఆర్‌ఎంఓ) : ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో మానుకోట ఏరియా ఆస్పత్రి ఉండడంతో రెండు జిల్లాలకు సంబంధించిన రోగులు వస్తున్నారు. రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీనికి తగ్గట్టు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి. అప్‌గ్రేడ్ చేయూల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శంకర్ నాయక్ : మంజూరైన రూ.కోటితో ఎలాంటి వసతులకు ప్రణాళిక రూపొందించారు ?
వెంకట్రాములు (సూపరింటెండెంట్) : మార్చురీలో ఏసీ బాక్సులు, జనరేటర్, మినరల్ వాటర్ ప్లాంట్, ఇతరత్రా నిర్మాణాలను చేపట్టాం. నిధులు మంజూరు చేయించినందుకు సిబ్బంది, వైద్యులు సంతోషిస్తున్నారు.
శంకర్ నాయక్ : ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా ?
కమల, శాంతమ్మ (రోగులు): తక్షణమే అంబులెన్స్‌తోపాటు జనరేటర్‌ను ఏర్పాటు చేయూలి. ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయూలి.
శంకర్ నాయక్ : భోజనం సక్రమంగా పెడుతున్నారా ?
రోగి మల్లయ్య : ఆస్పత్రిలో భోజనం మంచిగానే అందుతోంది. తాగునీటితోనే ఇబ్బందులు పడుతున్నాం. కొనుక్కుని నీళ్లు తాగుతున్నాం.
శంకర్ నాయక్ : ఆస్పత్రి సిబ్బంది సమస్యలేమైనా ?
సిబ్బంది (పేరు చెప్పకుండా) : క్వార్టర్స్ శిథిలావస్థకు చేరారుు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మరమ్మతుల బారిన పడిన క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్తవి నిర్మించాలి.
శంకర్ నాయక్ : ‘ఆరోగ్య శ్రీ’ ద్వారా ఎన్ని ఆపరేషన్లు చేశారు ?
జగదీశ్ (ఆర్‌ఎంఓ) : ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు 200 ఆపరేషన్లు చేశాం. రూ.30 లక్షలు ప్రభుత్వం ద్వారా వచ్చారుు. పిల్లలకు, పెద్దలకు సర్జరీలు, ఆర్థో, గైనకాలజిస్ట్‌కు సంబంధించిన ఆపరేషన్లు ఎక్కువగా చేశాం. శస్త్రచికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు ఉన్నాయి.
శంకర్ నాయక్ : మానుకోట నియోజకవర్గం రూపురేఖలే మార్చేందుకు అనేక పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశాం. సెంట్రల్ లైటింగ్ సిస్టం, మైసమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా, రింగు రోడ్డు, కోట్లాది రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టి మానుకోటను బంగారు కోటగా మారుస్తా. నాకు వీఐపీ రిపోర్టర్ అవకాశం కల్పించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని జీవితంలో మర్చిపోలేను. ఆస్పత్రిలో అన్ని సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ‘సాక్షి’కి అభినందనలు.
బంగారుకోట
Published Mon, Feb 16 2015 2:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement