ఎస్టీ సంక్షేమశాఖలో దరఖాస్తులు పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో వివిధ కార్పొరేషనల్ ద్వారా రుణాలు పొందేందుకు నిరుద్యోగ యువతీ, యువకులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా... ఆచరణలో మాత్రం వాస్తవ దూరంగా ఉంటోంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలో అభ్యర్థులు అందజేసిన దరఖాస్తులు మూలుగు తుండడమే దీనిని నిదర్శనమని చెప్పాలి.
రెండేళ్ల క్రితం 12 యూనిట్లు
బీసీ సంక్షేమ శాఖలో వివిధ కులాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కుల సంఘాలు, సమాఖ్యలకు 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 18 యూనిట్లు మంజూరు చేసింది. ఇందులోనూ 12 యూనిట్లకే ప్రభుత్వం నిధులు విడుదల చేసిం ది. గతంలో జిల్లాలో ఎస్టీ కార్పొరేషన్ జిల్లాలో లేని కారణంగా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణం అందించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాల కోసం ప్రస్తుతం ఎస్టీ కార్పొరేషన్‌లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా మండల స్థాయిలో దరఖాస్తులు సేకరణ పూర్తిగా మందగించింది. ఇలా వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఏళ్లుగా రుణాలు అందకపోవడం, పలు శాఖల్లో చాలా కాలంగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అవకాశమే కల్పించకపోవడం కారణంగా జిల్లాలో చాలా మంది నిరుద్యోగులు కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌లో 36 మంది
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులు చేసుకున్న వారికి నేటికీ పూర్తి స్థాయిలో రుణాలు అందలేదు. ఇలా చాలా మంది మిగిలిపోగా కొన్ని దరఖాస్తులను 2016–17లోకి మార్పు చేశా>రు. రెండేళ్లకు కలిసి మొత్తం 7,570 దరఖాస్తులు ఉండగా.. ప్రభుత్వం పరిశీలించి అర్హులైన 991 రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ 525 మందికే మంజూరు ఇచ్చారు. ఇలా అన్ని అనుమతులు ఉన్నా బ్యాంకుల నుండి పూర్తి స్థాయిలో రుణాన్ని పొందిన వారు కేవలం 36 మందే. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 584 మందికి రుణాలు అందించాలన్న ల్యోం కాగా.. 164 దరఖాస్తులకు అనుమతి లభించగా.. ఇంకా పూర్తి కావాల్సినవి 457 ఉన్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఎప్పుడెప్పుడా అంటూ కార్యాలయం వచ్చి ఆరా తీస్తున్నారు.
రుణమే లేని బీసీ కార్పొరేషన్
జిల్లాలో ఎక్కువ శాతం నిరుద్యోగులు బీసీ రుణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా రుణాలు మాత్రం మంజూరు చేయడం లేదు. గత రెండేళ్లుగా ఈ శాఖ పరిధిలో రుణాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అంతకు ముందు 2015–16 ఆర్థిక సంవత్సరంలో వివిధ కులసంఘాలు, సమాఖ్యలకు కలిసి మొత్తం 18 యూనిట్లకే ప్రభుత్వం అనుమతి ఇచ్చి.. 12 యూనిట్లకు రుణాలు మంజూరు చేశారు. అంటే మూడేళ్ల క్రితం నాటి దరఖాస్తులే ఇంకా ఆరు మిగిలిపోయాయి. ఇక 779 మందికి వ్యక్తిగత రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. 698 మంజూరయ్యాయి. అయితే, ఇందులోనూ ఎందరు ప్రత్యక్షంగా బ్యాంకుల ద్వారా రుణాలు పొందారన్న విషయంలో స్పష్టత లేదు. గతంలో గుడుంబా తయారీ, అమ్మకాలు వదిలిన 258 మందికి రూ.2.50 కోట్ల రుణసహాయాన్ని అందజేశారు. ఇవే కాకుండా 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఒక్కరికీ రుణం ఇవ్వకపోగా.. కనీసం దరఖాస్తులకు అÐ కాశం కూడా కల్పించకపోవడం గమనార్హం.
ఎస్టీ కార్పొరేషన్‌లో ప్రారంభం
ఎస్టీ కార్పొరేషన్‌లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు మంజూరు చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే రుణాలు త్వరగానే మంజూరు చేసే అవకా>శం ఉంది. అయితే వివిధ కార్యాలయాల్లో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల మదింపు, జిల్లా కార్యాలయానికి వాటిని పంపించడంలో జాప్యం జరుగుతోంది. 2017–18లో 584 యూనిట్లకు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. 164 దరఖాస్తులను అనుమతించారు. అంటే ఇంకా 457 దరఖాస్తులు పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ధరఖాస్తులను పరిశీలిం చడం, అర్హులైన వారి ఎంపికకు సంబంధించి వివరాలు, హార్డ్‌కాపీలను జిల్లా కార్యాలయానికి పంపించడంలో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.
ఇబ్బందులు నిరుద్యోగులు
జిల్లాలోని నిరుద్యోగులకు ఏళ్ల తరబడి రుణాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుండడంతో ఎందరో ఎదురుచూపుల్లో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిగత, సమాఖ్యలు, సహకార సంఘాలు, కులవృత్తి సంఘాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడంతో చాలా మంది యువకులు వీటిపై ఆశలు పెట్టుకున్నా ప్రభుత్వ జాప్యం.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి.
ఎంపిక చేసిన వారందరికీ రుణాలు
దరఖాస్తు చేసుకున్న అందరికీ రుణాలు మంజూరు చేస్తాం. ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ సంబంధం లేకుండా ఎంపిక చేసిన అందరికీ సబ్సిడీ వచ్చిన వెంటనే అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం తప్పక రుణాలు అందజేస్తాం. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి చాలా వరకు మంజూరయ్యాయి. కొందరికి మాత్రం పలు సమస్యల కారణంగా రుణాలు రాలేదు..
– విజయ్‌కుమార్, ఎస్సీ సంక్షేమ,అభివృద్ది శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment