ప్రభుత్వానికి ప్రతిపాదించిన బీసీ సంక్షేమ శాఖ
హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో బీసీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుకు, విద్యార్థులకు అదనపు సదుపాయాలకు బీసీ సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. హాస్టళ్లలోని చిన్న చిన్న మరమ్మతులను రూ.6.46 కోట్లతో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలను పెంచే ందుకు రూ.5.31 కోట్లు కేటాయించింది. పది జిల్లాల్లో ఉన్న 494 బీసీ ప్రి మెట్రిక్ హాస్టళ్లలో 42 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానానికి రూ.5 కోట్లకు, 1+1 బెడ్‌ల ఏర్పాటుకు రూ.28.68 కోట్లకు, సోలార్ ఎనర్జీ వాడకానికి రూ.25.34 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించింది.
ఇందులో భాగంగా రూ.7.91 కోట్లతో ఆర్‌వో ప్లాంట్‌లను ఏర్పాటు చే సేందుకు బడ్జెట్‌ను కేటాయించాల్సి ఉంది. విద్యార్థులకు రూ.4.68 కోట్లతో 4 జతల స్కూలు డ్రస్సులు (ఒక స్పోర్ట్స్ డ్రస్సుతో సహా), బ్లాంకెట్లు/క్విల్ట్‌లు రూ.2.89 కోట్లతో అందజేయాలని ఇదివరకే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని ముందుగానే అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
బీసీ హాస్టళ్ల సౌకర్యాల మెరుగుకు కార్యాచరణ
Published Wed, Apr 29 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement