అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్ | Be alert: CM KCR | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్

Published Sun, Oct 12 2014 1:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్ - Sakshi

అప్రమత్తంగా ఉండండి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: హుదూద్ తుపానుతో తెలంగాణ జిల్లాల్లోనూ భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ, ప్రకృ తి విపత్తుల నిర్వహణ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనాతో మాట్లాడారు. ఉత్తర తెలంగా ణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని బీఆర్ మీనాకు సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్‌ల నంబర్ల వివరాలు..
 
జిల్లా                    ఫోన్ నంబర్
ఆదిలాబాద్            08732221144
కరీంనగర్              18004254371
నిజామాబాద్          18004256644
రంగారెడ్డి               18004250817
నల్లగొండ               18004251442
మెదక్                   08455273525
మహబూబ్‌నగర్      9866098111
వరంగల్                08702510777
ఖమ్మం                 08742224204
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement