నవ్వుతారు?
పది కలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్లు నెల రోజులకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
నాణ్యతా ప్రమాణాలకు పాతరేసి జరుగుతున్న
రోడ్డు నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా
వ్యవహరిస్తుండడంతో అనుమానాలకు తావిస్తోంది. - న్యాల్‌కల్
ప్రజా ధనం వృథా.. ప్రయాణికులకు వ్యథ
* వేసిన నెల రోజులకే ధ్వంసమైన బీదర్-జహీరాబాద్ రహదారి
* చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
న్యాల్‌కల్ మండలం మీదుగా వెళ్లే బీదర్-జహీరాబాద్ రోడ్డు ఖలీల్‌పూర్, మిర్జాపూర్(బీ), గంగ్వార్, హుస్సెళ్లి తదితర ప్రాంతాల్లో పాడైపోయింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల పీర్(పిరియేడికల్ రినివల్స్) పథకం 5.5 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ .1.88 కోట్లు మంజూరు చేసింది.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఖలీల్‌పూర్, మిర్జాపూర్(బీ) తదితర ప్రాంతాల్లో పాడైన రోడ్డును జేసీబీ సహాయంతో తవ్వేసి కొత్తగా తారు రోడ్డు పనులు చేపడుతున్నారు. ఈ పనులు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. ఒక పక్క రోడ్డు పనులు కొనసాగుతుండా మరో పక్క నాణ్యతా ప్రమాణాలు లేక వేసి రోడ్డుపై తారు లేచిపోతుంది. ఖలీల్‌పూర్ గ్రామ శివారులో నిర్మించిన సుమారు అర కిలోమీటరు తారు రోడ్డు యథావిధిగా తయారైంది.
రోడ్డు కిందకు కుంగిపోయి వేసిన తారు, కంకర తేలిపోతుంది. రోడ్డు పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.