సరిహద్దులో ఎకై్సజ్ చెక్‌పోస్టులు | Border on check posts Arrangement | Sakshi
Sakshi News home page

సరిహద్దులో ఎకై్సజ్ చెక్‌పోస్టులు

Published Thu, Jun 5 2014 2:56 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

సరిహద్దులో ఎకై్సజ్ చెక్‌పోస్టులు - Sakshi

సరిహద్దులో ఎకై్సజ్ చెక్‌పోస్టులు

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్ :జిల్లా సరిహద్దులో మూడు ఎకై్సజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది చెక్‌పోస్టులు మం జూరైతే అందులో మూడింటిని జిల్లా సరిహద్దుల్లోనే ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా హాలియా ఎకై్సజ్‌స్టేషన్ పరిధి నాగార్జునసాగర్‌లో ఒకటి, మిర్యాలగూడ స్టేషన్ పరిధి నల్లబందగూడెం, దామరచర్ల మండలం వర్దన్నపల్లిలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు తెలిసింది. కాగా, ఆయా ప్రాంతాలలో చెక్‌పోస్టుల ఏర్పాటుకు అధికారు లు స్థలసేకరణలో నిమగ్నమైనట్లు సమాచారం.  రెండు రాష్ట్రాల మధ్య మద్యం ఎగుమతి, దిగుమతులపై నిఘా వేసేం దుకే ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు నిత్యం రవాణా అయ్యే సారాకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టులతో పాటు గతంలో జిల్లాల మధ్య ఉన్న టాస్క్‌ఫోర్స్ బృందాలు, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలలోని  ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.  

సాగర్‌లో వాహనాల తనిఖీ షురూ
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్‌లో మంగళవారం నుం చి ఆర్టీఓ అధికారులు వాహనాల తనిఖీకి శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ ఎంవీ ఐ నరేష్, తన సిబ్బందితో కలిసి ఆధ్రాకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. అయితే సాగర్‌లో నేటికీ చెక్‌పోస్టు ఏర్పాటు చేయలేదు.తాత్కాలి కంగా హిల్‌కాలనీలోని పర్యాటక సమాచార కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు జరుపుతున్నారు. ఈ కార్యాలయం 20 సంవత్సరాలుగా మూతపడే ఉంది. గతంలో స్థానిక గ్రీన్‌లాండ్ హోటల్‌లోని ఓ గదిలో కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని నాలుగేళ్ల క్రితం నల్లగొండకు తరలించారు. అయితే తిరిగి సాగర్‌లోనే పర్యాటక సమాచార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు ఆదేశించారు. నల్లగొండకు చెందిన ఓఅధికారి మాత్రం ఈ కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోనే ఉంచేందుకు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఆర్టీఓ చెక్‌పోస్ట్‌కు కేటాయించాలని అధికారులు ఇటీవల కలెక్టర్‌కు విన్నవించారు. కానీ నేటి వరకు అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో తాత్కాలికంగా  చెక్‌పోస్టును ఎక్కడ ఏర్పాటు చేయాలో అధికారులకు అర్థంకాని పరిస్థితి నెలకొన్నది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement