మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మళ్లీ ప్రచార ....
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మళ్లీ ప్రచార పర్వం మొదలైంది. ఇటీవల దాదాపు అన్ని ఎన్నికలు ఒకే సారి రావడంతో సందడిగా కనిపించిన పల్లెలు ఎలక్షన్లు ముగియడంతో ప్రశాంతంగా కనిపించాయి.
ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ మైకుల మోతలు.. నేతల రాకలు ఊపందుకున్నాయి. నామినేషన్లు, ఉప సంహరణల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాల బాట పట్టారు. సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనల కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు.