
'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు'
హైదరాబాద్: సెక్షన్ 8ను ఓటుకు కోట్లు కేసుతో ముడిపెట్టడం సరికాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యకాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాత సెక్షన్ 8 అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోదండరాం స్పందించారు.