Prof. Kodandaram
-
ఎమ్మెల్సీగా కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్‌ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్‌ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా..వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్‌ను నియమించారు. పెద్దల సభకు ఉద్యమ సారథి కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు. ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
ఒకే నెలలో ఇన్ని పరీక్షలా?
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రి: గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగ అభ్యర్థులు ప్రయత్నించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు నిరసన గళంతో కదం తొక్కారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించగా మరికొందరు కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ స్వయంగా వచ్చి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే తప్ప ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. వీరికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ఆగస్టులో గురు కుల, ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయని, ఒకేసారి నాలుగు పరీక్షలు నిర్వహిస్తే ఎలా సిద్ధం కావాలని ప్రశ్నించారు. ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన గ్రూప్–2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి అభ్యర్థులను అక్కడ నుంచి పంపించి వేశారు. ఉదయం నుంచీ ఉద్రిక్తత గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పరీక్షలు దాదాపుగా ఒకే సమయంలో నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కొందరు సభ్యులు ఈ విషయాన్ని లేవనెత్తారు. అయితే కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం టీఎస్పీఎస్సీ ముట్టడికి టీజేఎస్, కాంగ్రెస్ పార్టీలు పిలుపునిచ్చాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరావడంతో ఉదయం నుంచీ ఉద్రిక్తత నెలకొంది. ఓయూ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులు నిరుద్యోగులకు మద్దతుగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్–2 పరీక్షల వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సీహెచ్ చంద్రశేఖర్‌తో పాటు 149 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్.. తదితర నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్–2 వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జూన్ 26న, జూలై 24న రెండుసార్లు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. -
అందరికీ ఒకే రకమైన విద్య అందాలి
వర్సిటీల ప్రైవేటీకరణ దారుణం: కోదండరాం • విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాం డ్ చేశారు. సోమవారం గన్‌పార్కు వద్ద తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యం లో జరిగిన విద్యా పోరాట బస్సు యాత్ర ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణ బిల్లు ఉన్నత విద్యారంగానికి గొడ్డలి పెట్టు వంటిదని కోదండరాం అన్నారు. రెండు దశాబ్దాలుగా వర్సిటీల్లో నియామకాల్లేవన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించ కుంటే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అసాధ్యమన్నారు. పాలకవ ర్గాలు ప్రసార మాధ్యమాలను గుప్పిట్లో ఉంచుకుని తమ అభిప్రాయాలను, నిర్ణయా లను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయ త్నం చేయడం సరికాదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. విద్యా పోరాట యాత్రకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుం దని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి ప్రకటిం చారు. కాగా, ఈ బస్సు యాత్ర ఈ నెల 20 వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. సోమవారం సాయంత్రం ఉస్మానియా వర్సిటీకి చేరుకున్న బస్సుయా త్రకు ఓయూ విద్యార్ధులు, వివిధ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. సమాన విద్య కోసం పోరాడుదాం: ప్రొఫెసర్ హరగోపాల్ పేద, ధనిక తేడా లేకుండ అందరికీ సమాన విద్య కోసం కలసి పోరాడాలని ప్రొఫెసర్ హరగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య హమీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతినివ్వకుండా ప్రభుత్వ వర్సిటీలను బలోపేతంచేయాలని పేర్కొన్నారు. అంతకుముందు గన్‌పార్కు వద్ద హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యాలయాలను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం దుర్మార్గమైన రిలయన్స్ సంస్థకు విశ్వవిద్యాలయాలను అప్పగిస్తామని చెప్పడం దారుణమన్నారు. ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, మానవీయ తెలంగాణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.10 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించడం సిగ్గు చేటన్నారు. కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయించకుంటే ఎలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చక్రధర్, కార్యనిర్వాహక కార్యదర్శి కె.లక్ష్మీ నారాయణ, ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు రహమాన్, ప్రొ.పద్మజాషా, ప్రొ.రత్నం, ఏఐఎస్ఎఫ్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్ఎల్ మూర్తి, పీడీఎస్‌యూ నాయకులు రంజిత్, నాగేశ్వర్రావు, డీఎస్‌యూ బద్రీ, నాయకులు అరుణాంక్ తదితరులు పాల్గొన్నారు. -
22న నిరుద్యోగ నిరసన ర్యాలీ
ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తాం: కోదండరాం ♦ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యం ♦ లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది ♦ ఇప్పుడు యువత ఆందోళనలో ఉన్నా పట్టించుకోవడం లేదు ♦ జేఏసీ, సంఘాల నేతలను పోలీసులు వేధిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు వెంటనే పని చూపించాలనే డిమాండ్‌తో ఈ నెల 22న నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం నేతలు పిట్టల రవీందర్, పి.రఘులతో కలసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కోదండరాం విమర్శించారు. వివిధ శాఖల్లో 1.07 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం 2014 లోనే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పటిదాకా మరో 30 వేల ఖాళీలు పెరిగాయని... త్వరలోనే ఇంకో 14 వేల పోస్టులు ఖాళీ కానున్నాయని చెప్పారు. వీటితోపాటు పబ్లిక్ రంగంలో మరో 50 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... ఇప్పటిదాకా టీఎస్పీఎస్సీ ద్వారా 50 నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం 6 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని కోదండరాం స్పష్టం చేశారు. వాటికి పోలీసు ఉద్యోగాలను కలిపితే మొత్తం 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఉద్యోగాల విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు సతాయిస్తే వెనక్కి తగ్గుతామా? పోలీసులు టీ జేఏసీ నేతలు, సంఘాల నాయకుల ఇళ్లకు నాలుగైదు సార్లు వచ్చి, వ్యక్తిగత వివరాల కోసం సతాయిస్తున్నారని కోదండరాం చెప్పారు. ఇది జుగుప్సాకరమైన, అన్యాయమైన పద్ధతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సతాయింపులకు దిగడం ద్వారా ప్రశ్నించే వారిని ఆపుతామనుకుంటే అవివేకమని విమర్శించారు. జేఏసీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ అని, జేఏసీ నేతలను ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదని పేర్కొన్నారు. ‘పోలీసుల వేధింపులు, సతాయింపులతో తెలంగాణ రాష్ట్రమే ఆగలేదు, హక్కుల కోసం చేసే పోరాటం ఆగుతుందా?’అని ప్రశ్నించారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. సీఎం పర్యటన ఉంటే ఆ రహదారిలోని వారందరినీ అరెస్టులు చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను జేఏసీ నేతలు ఆవిష్కరించారు. సమావేశంలో జేఏసీ నేతలు ప్రహ్లాదరావు, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, గోపాలశర్మ, భైరి రమేశ్, మాదు సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. యువత ఆశలు గల్లంతు ప్రభుత్వం ఏటా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి, మాటతప్పిందని కోదండరాం విమర్శించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలకు వేలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకున్న యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్కు వద్ద సభ నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 22న భారీ ర్యాలీ చేపడుతున్నామని కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ యువతతో కలసి నిరసనల్లో పాల్గొంటామని చెప్పారు. -
ఆశించిన స్థాయిలో పాలన లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం వీణవంక: ఉద్యమ కాలంలో ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాలన కొనసాగడంలేదని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ వస్తే నౌకరీ వస్తదని ప్రజలు ఆశపడ్డరు... కానీ ఆ పరిస్థితి కనిపించడంలేద’న్నారు. తెలంగాణకు సింగరేణి గుండెకాయలాంటిదని ఈ ప్రాంత ప్రజలకు ఎంతో దోహదపడుతుందన్నారు. అలాంటి సింగరేణిని విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా పాలకుల లాగే మన పాలకులు కూడా కేవలం హైదరాబాద్ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టారని ఆరోపించారు. మరీ మిగితా జిల్లాల అభివృద్ధి విస్మరించడం మంచిది కాదని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను విస్మరించకుండ అభివృద్ధి చేయాలని సూచించారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా చేయాలని కోరారు. ఏటా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, అదేవిధంగా వ్యవసాయం, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో జేఏసీని విస్తరిస్తామని జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర జేఏసీ నాయకులు వెంకట్‌రెడ్డి, పిట్టల రవీందర్, ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు. -
స్థానిక సమస్యలపై సమరం
టీజేఏసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం కొత్త జిల్లాల్లో సమస్యల గుర్తింపుపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటైన జిల్లాలను ప్రజల్లో చైతన్యానికి, సమస్యలపై పోరా టాలకు అనుకూలంగా వాడుకోవచ్చని తెలంగాణ జేఏసీ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్త సమ స్యల పరిష్కారంకోసం పోరాడుతూనే జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కా రంకోసం పోరాడాలని జిల్లా జేఏసీలకు ముఖ్యనేతలు సూచనలు చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కన్వీ నర్లు, ముఖ్యులతో ఇటీవల జరిగిన సమా వేశంలో ఈ దిశలో పలు అంశాలపై చర్చించారు. జిల్లాల విభజనలో శాస్త్రీయత లేకపో వడంవల్ల అదనంగా కొన్ని సమస్యలు వస్తాయని, వాటితో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపైనా అధ్యయనం చేయాలని జిల్లా నాయకులకు నిర్దేశించారు. దీనికోసం రాష్ట్ర స్థాయి నుంచి సమన్వయం చేయడానికి బాధ్యులను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా సమస్యలు నెలకొన్నాయని, వాటిపై క్షేత్రస్థాయి నుంచి పోరాటాలను చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాల విభజనతో క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం, నాయకత్వం, బాధ్యతల వంటి వాటి విషయంలో కొంత జాప్యం జరిగిన ట్టుగా జేఏసీ భావించింది. భూ నిర్వాసితుల సమస్యపై జేఏసీ చేస్తున్న పోరాటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంతో పాటు ప్రతిపక్షాలను కూడా ఏకం చేయగలిగింది. ఈ నేపథ్యంలో కీలకమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై తదుపరి కార్యాచరణకు జేఏసీ సిద్ధం అవుతోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీయింబర్సుమెంటు, యూని వర్సిటీలలో సిబ్బంది కొరత, హాస్టళ్లపై నిర్లక్ష్యం వంటి అంశాలపై ఇప్పటికే జేఏసీ సదస్సులను నిర్వహించింది. వైద్య రంగంపై దృష్టి... వైద్యరంగంలోనూ పేదలకు ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతు లు, సిబ్బంది లేకపోవడం వంటి సమస్యలపై ఇప్పటికే మానవహక్కుల సంఘానికి జేఏసీ ఫిర్యాదు చేసింది. ఖమ్మం, ఆదిలాబాద్ వంటి గిరిజన, ఆదివాసీప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను పెంచాలని, పరిశుభ్రత చర్యలను చేపట్టాలని, రోగ నిర్ధారణకు అవసరమైన పరికరాలను ఏర్పా టుచేయాలని జేఏసీ ఆందోళనలు నిర్వహిం చింది. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులు పేదలను పీల్చుకు తింటున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులతోపాటు అన్ని అత్యవసర చికిత్స లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తే పేద ప్రజలకు ఇబ్బందులు తీరుతాయని జేఏసీ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించింది. మరో వైపు తెలంగాణరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నియామకాల డిమాండ్‌పైనా జేఏసీ దృష్టి సారించింది. వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకోసం యువతకు ఆర్థికసహాయం అందించాలని, రాష్ట్రంలో వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ వినతిపత్రాలను ఇచ్చింది. ఈ అంశాలపై కొత్త జిల్లాలను వేదికగా చేసుకుని పోరాటాలు చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాలని నాయకత్వం సూచనలను చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలాలు అట్టడుగు వర్గాలకు అందించేవిధంగా ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం చేసి, నివేదికలను రూపొందించాలని జిల్లాల జేఏసీలకు సూచనలు అందించారు. సమగ్ర అధ్యయనం తర్వాత స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆ తరువాత ప్రత్యక్ష కార్యాచరణకు ప్రజలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
‘మిలియన్ మార్చ్’ తరహా నిర్బంధమా?
-
‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమ వుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. 1980 దశకం తొలిరోజులు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో విద్యార్థినిని వేధించిన సంఘటనలో ఒక ప్రొఫెసర్‌ను సస్పెండ్ చెయ్యాలని కోరుతూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూనివ ర్సిటీ పాలకవర్గం దిగిరాలేదు. ఉద్యమంలో భాగంగా దశలవారీ ప్రదర్శ నలు, రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక విద్యా ర్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అప్ప టికి హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏర్పడలేదు. విద్యా ర్థిని వేధింపు వ్యవహారంలో ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలని ఉద్యమిం చిన విద్యార్థుల బృందమే అంతకు ముందు యూనివర్సిటీ పాలకవర్గానికి ఒక ముసాయిదా నియమావళిని తయారుచేసి సమర్పించింది. దాని మీద ఇంకా నిర్ణయం జరగక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో విద్యా ర్థులు ఉద్యమించారు. యాజమాన్యాన్ని దారికి తెచ్చేందుకు హైదరాబాద్ అబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్లో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిం చాడు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ముందుగా ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి విచారణ జరపాలన్నది విద్యార్థుల డిమాండ్. విచారణలో తేలితే కానీ సస్పెండ్ చేయబోమని యూనివర్సిటీ యాజమాన్యం మొండి కేసింది. చివరికి ప్రొఫెసర్ సస్పెన్షన్ జరిగాకే ఆ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఆ సంఘటనతో చాలా మార్పు వచ్చింది. విద్యార్థి బృందం సమర్పించిన ముసాయిదా నియమావళిని మెజారిటీ విద్యార్థులు ఆమోదించి ఆనాటి నుంచి దాని ఆధారంగానే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రమేయం ఏ మాత్రం లేకుండా విద్యార్థులే ఈ ఎన్నికలు అత్యంత ప్రజాస్వామిక వాతా వరణంలో ఇప్పటికీ జరుపుకోవడం విశేషం. తోటి విద్యార్థినికి న్యాయం చేయడం కోసం ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు తెగించిన ఆ విద్యార్థి ఆ తరువాత కాలంలో ఒక మంచి అధ్యాపకుడిగా, పౌర హక్కుల ఉల్లంఘనను ప్రతిఘటించేందుకు జరిగిన ప్రతి ఆందోళనలోనూ అడుగు కలిపిన మానవ హక్కుల కార్యకర్తగా సుప్రసిద్ధుడైన ప్రొఫెసర్ కోదండరామ్. 2009 డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 24 గంటలలోనే వెనక్కి పోయిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ దారికి తేవడం కోసం ఏర్పడిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్. సెంట్రల్ యూని వర్సిటీలో విద్యార్థినికి న్యాయం చేయడం కోసం దీక్ష చేయడం మొదలు, తెలంగాణ సాధన కోసం జరిగిన మహోద్యమంలో జేఏసీ అధ్య క్షుడి బాధ్య తలు నిర్వహించే వరకూ కోదండరామ్ ప్రజాపక్షమే. పొలిటికల్ జేఏసీ ఎలా వచ్చింది? డిసెంబర్ 9 ప్రకటనతో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవడంతో హుటాహుటిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానా రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయం ఫలితమే ఇవాళ మనం పొలిటికల్ జేఏసీ అని చెప్పుకుంటున్న సంఘం. 2009 డిసెంబర్ 24న హైదరాబాద్ లోని కళింగభవన్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రతిపాదన మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్‌గా రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటైంది. తరువాత వాటి వాటి కార ణాల వల్ల కాంగ్రెస్ వంటి పార్టీలు బయటికి వెళ్లిపోయాయి. టీడీపీ వంటి పార్టీని పంపించేశారు. అన్ని రాజకీయ పక్షాలనూ ఒక్క తాటి మీదకు తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆలోచనతో, కేసీఆర్ చొరవతో ఏర్పడిన ఈ జేఏసీ బహుశా ప్రపంచంలోనే ప్రజా ఉద్యమాలన్నిటికీ మార్గదర్శిగా, దిక్సూ చిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన కోసం బలంగా నాటుకుపోయిన ఆకాంక్ష కారణంగా రాజకీయాలను పక్కకు నెట్టేసి సబ్బండ వర్ణాలూ ఈ జేఏసీలో చేరిన కారణంగానే ఉద్యమం విజయం సాధించిందనడంలో సందేహం లేదు. జేఏసీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే కుల, వృత్తి, ఉద్యోగ, విద్యార్థి సంఘాలన్నీ జేఏసీలుగా ఏర్పడి ప్రధాన జేఏసీ వెంట నడిచి ఉద్యమాన్ని విజయవంతం చేశాయి. మిలియన్ మార్చ్ చేసినా, సాగరహారం నిర్మించినా, సకల జనుల సమ్మెను చెదిరిపోకుండా బలంగా నిలబెట్టినా, రాష్ట్రమంతటా వంటావా ర్పులు చేసి వందల కిలోమీటర్ల రోడ్లను దిగ్బంధం చేసినా, ఒక్క పిలుపుతో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయినా అది కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీ కృషి, పట్టుదల, నిబద్దత కారణంగానే. ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితికీ, దానికి నాయకత్వం వహించి, అన్ని ఆటుపోట్లనూ తట్టుకుని ముందుకు నడిపిన చంద్రశేఖరరావుకు రాజకీయ నాయకత్వాన్ని ప్రభా వితం చేసి కేంద్రాన్ని రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకునే వైపు అడుగులు వేయించిన ఘనత ఎంత దక్కుతుందో, క్షేత్ర స్థాయిలో ప్రజలను కదిలించి, వారిని ప్రభావితం చేసి ఉద్యమ సెగ పాలకవర్గాలకు తగిలేట్టు చేసి టీఆర్ఎస్కు అవసరమైన బలాన్ని సమకూర్చిన జేఏసీకి అంతే దక్కుతుంది. ఒకానొక దశలో జేఏసీ తెరాస కనుసన్నల్లో నడుస్తున్నదని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించినా, తమ మాట వినడంలేదని కోదండరామ్ మీద టీఆర్ఎస్ పెద్దలు అలకబూని పరోక్ష సహాయ నిరాకరణకు దిగినా చలించకుండా ఉద్య మానికి జేఏసీని బాసటగా నిలిపింది కోదండరామ్ నాయకత్వ దక్షతే. జేఏసీ ఆవిర్భావ సభ చరిత్రాత్మకమే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించి మొన్న 24వ తేదీకి ఏడేళ్లు నిండిన సందర్భంగా సభ జరిగింది. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ద్ధమై చంద్రశేఖరరావు చేసిన ఆమరణ దీక్షను గుర్తుచేసుకోడానికి దీక్షా దివస్ నిర్వహించడం ఎంత సమంజసమో, జేఏసీ ఆవిర్భావ సభను జరుపుకోవడం అంతే సమంజసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించిన జేఏసీని మరచిపోవడానికి వీలులేదు. అయితే లక్ష్యం నెరవేరిన తరువాత కూడా జేఏసీ అవసరం ఏముంది? అన్న ప్రశ్న వినిపిస్తున్నది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కూడా అప్పట్లో ఇటువంటి వాదనే వినిపించింది. అయితే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఎన్నికల బరిలో నిలిచి అధికారం చేజిక్కించుకుంది. నిజానికి ఇవాళ పేరుకే అది పొలిటికల్ జేఏసీ కానీ, అందులో టీఆర్ఎస్ సహా ఏ రాజకీయ పార్టీ భాగస్వామి కాదు. ఉద్యమకాలంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు దూరమ య్యాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకూ, జేఏసీలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన ఇతర విద్యార్థి నాయకులకూ, మేధావులకూ కొన్ని ప్రభుత్వ పదవులు వచ్చాయి. అట్లా పదవులు పొందిన వారి అర్హతలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ జేఏసీని కొనసాగించడానికీ, దానిని మళ్లీ పునర్వ్యవస్థీకరించడానికీ సాగుతున్న ప్రయత్నం మీద ఎందుకు పెద్ద ఎత్తు్తన దాడి జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్లీ అన్యాయం జరగకుండా సచివాలయం ముందు కుర్చీ వేసుకుని కూర్చుని కాపలా కాస్తాను అన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పరిపాలనలో జరిగే పొరపాట్ల మీద విమర్శలు చేసే వారి పట్ల అసహనం సముచితమేనా? కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం తీసుకుని పోటీ చేసి గెలిచిన శాసన సభ్యులను రాజీనామా చేయించకుండా తమ బలాన్ని పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీలోని ఏ నాయకుడికి అయినా కోదండరామ్ టీఆర్ఎస్ ఏజెంట్ అనే అర్హత ఎట్లా ఉంటుంది? జేఏసీ ఏర్పడే వరకూ కోదండరామ్ ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడుకాదు. భవిష్యత్తులో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఎవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాలూ, పథకాల మీద జేఏసీ కానీ, కోదండరామ్ కానీ చేసే విమర్శలు అవాస్తవాలు అయితే వివరణ ఇచ్చే అవకాశాన్ని, అవసరాన్ని వదిలేసి అసహనాన్ని వ్యక్తం చెయ్యడం, అందునా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా రాజ కీయాల్లో ఓనమాలు కూడా నేర్వని బాల్క సుమన్ వంటి వాళ్ల చేత దాడి చేయించడం ఆరోగ్యకరం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి్త కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇంకా ఆదరిస్తున్నారు. టీఆర్ఎస్కు ఆ విశ్వసనీయత రావడంలో జేఏసీ పాత్ర కూడా ఉంది. ఆ కారణం కూడా తోడై ఇతర రాజకీయపక్షాలు ఇవాళ నామ మాత్రంగా, నిష్క్రియాపరంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో జేఏ సీని బలోపేతం చేసే ఆలోచన కోదండరామ్ వంటి వారికి రావడాన్ని సహ జంగానే అధికారపక్షం జీర్ణించుకోలేకపోతున్నది. కోదండరామ్ నాయకత్వంలో బలోపేతం కావాలనుకుంటున్న జేఏసీ భవిష్యత్తులో రాజకీయ స్వరూపం తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యం మాత్రం ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా ఆహ్వానిం చాల్సిందే. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
వాళ్ల భూములే టార్గెట్ అవుతున్నాయ్
హైదరాబాద్: భూ సేకరణలో అంతిమంగా ఆదివాసీల అసైన్డ్ భూములే టార్గెట్ అవుతున్నాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసూటికల్ కంపెనీలు మొదలుకొని ఏ అవసరానికి భూ సేకరణ చేసినా.. అక్కడ ఆదివాసీలకు ఇచ్చిన భూములను యథేచ్ఛగా గుంజుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో గిరిజనులకు జరుగుతోన్న 'అన్యాయాలు - భవిష్యత్ కార్యాచరణ' అనే అంశంపై గిరిజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్ చౌహాన్ అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. అసైన్డ్ భూములంటే ఎప్పుడైనా గుంజుకోవచ్చనే ధోరణి సరికాదని ఆ భూమిని ఎవ్వరికీ అమ్మకూడదు, కొనకూడదనే నియమం తప్ప దానిపై ఇతర రైతులకున్నట్టే ఆదివాసీలకూ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అడవుల పెంపకానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అడవుల పెంపకం పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో ఆదివాసీల హక్కులకు భంగం కలిగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచీలతో ఒక మాన్యువల్‌ని తయారు చేసిందని, దాన్ని అనుసరిస్తే తెలంగాణలో విషజ్వరాల నుంచి గిరిపుత్రులను కాపాడుకోగలుగుతామని చెప్పారు. తెలంగాణ గిరిజనుల సమస్యల పరిష్కారానికి జేఏసీ కార్యాచరణను తయారుచేస్తుందని తెలిపారు. -
ప్రొ.కోదండరామ్‌తో టీటీడీపీ అధ్యక్షుడు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ మంగళవారం ఉదయం ప్రొ. కోదండరామ్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై... తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఎల్ రమణ.. ప్రొ.కోదండరామ్ ని కోరినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహారిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ ఇటీవల అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రతిపక్షా పార్టీల సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. అలాగే ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ తెలంగాణ బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపు నిచ్చాయి. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపింది. దీంతో బంద్ అంతాగా విజయం సాధించలేకపోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండరామ్ మద్దతు తీసుకుని... టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని టీటీడీపీ భావిస్తుంది. ఆ క్రమంలో ప్రొ. కోదండరామ్‌ను మద్దతు కోరేందుకు ఎల్ రమణ భేటీ అయ్యారు. -
'అది రెండు రాష్ట్రాల సమస్యకాదు'
హైదరాబాద్: సెక్షన్ 8ను ఓటుకు కోట్లు కేసుతో ముడిపెట్టడం సరికాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యకాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ముడుపులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాత సెక్షన్ 8 అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కోదండరాం స్పందించారు.