
తెలంగాణ ప్రభుత్వానికి చేరిన కేంద్ర సర్క్యులర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలపై కేంద్రం పంపిన సర్క్యూలర్ తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. గవర్నర్ అధికారాలపై కేంద్రం ఆ డ్రాప్ట్లో పేర్కొంది. హైదరాబాద్‌లో కామన్ పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. అయితే కేంద్రం ఆలోచన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, గవర్నర్ అధికారాలకు సంబంధించిన ఆర్డినెన్స్ను పార్లమెంట్‌లో పూర్తిగా వ్యతిరేకించాలని తెలంగాణ ఎంపిలకు కేసీఆర్ చెప్పారు. ఈ ఉదయం ఆయన ఎంపిలతో సమావేశమయ్యారు. తెలంగాణకు అన్యాయంగా చేసే విధంగా ఉన్న ప్రతి బిల్లును వ్యతిరేకించాలని ఆదేశించారు.