
కల్యాణలక్ష్మి ఆదాయ పరిమితిలో మార్పు
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకంలో ఆదాయపరిమితిలో మార్పులు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పట్టణాల్లో ఉండే వారి కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షికాదాయం రూ.లక్షన్నర లోపు ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మైనారిటీలకు వర్తించే ‘షాదీ ముబారక్’ పథకానికి కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయ పరిమితులు వేర్వేరుగా ఉన్నాయి. ఇదే తరహా నిబంధనను బీసీ, ఈబీసీలకు అమలయ్యే తీరుగా ఈ మార్పులు చేశారు.