కొత్త జిల్లాల నేపథ్యంలో
వచ్చే ఏడాది నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. ప్రాథమిక మార్పులపై చర్చించిన ఉన్నతాధికారులు.. లోతైన అధ్యయనానికి త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాంఘిక శాస్త్రం, పర్యావరణ అధ్యయన పుస్తకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాంఘిక శాస్త్రా ల్లో వివిధ జిల్లాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన చిత్రపటాలను మార్పునకు చర్య లు చేపడుతోంది. తెలుగు పాఠ్యపుస్తకాల్లో మార్పులపై పరిశీలన జరపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది పాఠ్య పుస్తకాల ముద్రణకు ముందే మార్పులను ఖరారు చేయాలని నిర్ణయించింది. లింగ భేదం, వివక్ష వంటి అంశాలపైనా పాఠ్యాంశాలు పెట్టాలని ఎస్‌సీఈఆర్‌టీ నిర్ణయిం చింది. 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాల్లో ఈ పాఠాలు అందుబాటులోకి తేనుంది.
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్: ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, మానవహక్కులు వంటి అంశాలను పాఠ్యాం శాలుగా పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పాఠాలు పాఠశాల నుంచి ఉన్నత విద్య కోర్సుల వరకు ఉండాల్సిందేనని రిజర్వు బ్యాంకు ఇటీవల ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్, అకౌంట్స్ తదితర అంశాలపై పాఠ్యాంశాలు రూపొందించేందుకు ప్రభుత్వ ఆమోదం తీసుకునేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది.
పాఠ్య పుస్తకాల్లో మార్పులు
Published Sat, Oct 15 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
Advertisement