వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణాలు
-
బాలింత మరణాలపై మావన హక్కుల వేదిక విచారణ
నార్నూర్ : ఏజెన్సీ ప్రాంతంలో పౌష్టికాహార లోపం, వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడుతున్నారని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగ్‌రావు అన్నారు. మండలంలోని బేతాల్‌గూడ గ్రామంలో మతి చెందిన బాలింత సరస్వతి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు గిరిజనులకు వైద్యం అందించడంలో చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. రిమ్స్‌లో సకాలంలో వైద్యం అందకనే మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో వైద్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీలో మృతి చెందిన బాలింతల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ మానవ హక్కుల వేదిక న్యాయ పోరాటం చేస్తుందన్నారు. ఆయనతో పాటు టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక వెంకటేశ్, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లేశం, గిరిజన సంఘం మహిళా నాయకురాలు పద్మ, లీగల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు మాదాసు మధు తదితరులు ఉన్నారు.
పోలీసులపై పనిభారం తగ్గించాలి
కెరమెరి : పోలీసులపై పని భారం తగ్గించి వారు ఆత్మసై్థర్యం కోల్పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భజంగ్‌రావు అన్నారు. ఇటీవల కెరమెరి ఎసై ్స శ్రీధర్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను ఏఎసై ్స శివరాజ్ నుంచి అడిగి తెలుసుకున్నారు. పోలీసులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతన్నాయని ఆరోపించారు. అత్యవసర సమయాల్లో కూడా ఉన్న సెలవులను వినియోగించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. పోలీసు రంగంలో పని చేసిన వారికి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎసై ్సల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక ^è ర్యలు తీసుకోవాలని కోరారు. ఎసై ్స మృతిపై చేపట్టిన విచారణను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడులు లేకుండా చూడాలని అన్నారు. పోలీసుల పనిభారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. అతని వెంట బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోరన్ ప్రభాకర్, హెచ్‌ఆర్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లేశం ఉన్నారు.