షోలే సినిమాలో గబ్బర్ సింగ్ కేసీఆర్: రేవంత్
Published Mon, Mar 27 2017 6:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను స్పీకర్ సస్పెండ్ చేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిం చిన మంత్రి హరీష్‌ను, అసెంబ్లీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. షోలే సినిమాలో గబ్బర్‌సింగ్‌లా కేసీఆర్ సభలో ప్రజా సమస్యలను చర్చకు రానీయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైందని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని అన్నారు. రెండు పార్టీల నేతలు ఒకరినొకరు పరస్పరం పొగుడుకున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement