చింతపల్లి: అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్సై సహా మరో ఇద్దరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చింతపల్లి ఎస్సైగా పని చేస్తున్న ఎస్. రాఘవేందర్‌రెడ్డి ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఇసుక తరలిస్తున్న వారి వద్ద అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో.. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఎస్సైతో పాటు ఓ హెడ్‌కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఇసుక తరలిస్తున్న తమను డబ్బుకట్టాలని ఎస్సై వేధిస్తున్నాడని గణేష్‌రెడ్డి అనే వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.