చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్‌ | CM KCR calls to village meeting from september 2 | Sakshi
Sakshi News home page

చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్‌

Published Sat, Aug 26 2017 5:46 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్‌ - Sakshi

చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: భూముల రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాల నిర్మాణం విషయమై సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని పార్టీ ప్రజాప్రతినిధులకు టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ మేరకు  సీఎం కేసీఆర్‌ శనివారం సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 2 నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ సందర్భంగా ఏర్పాటుచేసే రైతుసంఘాల్లో రాజకీయాలు లేకుండా చూడాలని ఆయన సూచించారు.

రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, భూముల సంబంధించిన రికార్డులపై చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. భూ రికార్డులకు సంబంధించిన ఏ మార్పైన నేరుగా రైతుల ద్వారానే జరగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు నూతన విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement