ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు | congress working on party cadidates for council elections | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు

Published Fri, Feb 13 2015 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress working on party cadidates for council elections

- పొన్నాలను పరామర్శించిన కొప్పుల


హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కసరత్తు ప్రారంభించింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఈ మూడు జిల్లాల అధ్యక్షులతో, పార్టీ ముఖ్య నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోనులో మాట్లాడారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ విషయంలోనూ ఆ మూడు జిల్లాల ముఖ్యులతో చర్చిస్తున్నారు. ఈ ఎన్నికలకు పార్టీ పరంగా అభ్యర్థులను పోటీకి నిలపడం ఇదే మొదటిసారి. ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను పోటీకి నిలపనున్న విషయాన్ని ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుకు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. పొన్నాలను గురువారం కొప్పుల రాజు పరామర్శించిన సందర్భంగా ఈ ఎన్నికల విషయం చర్చకు వచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement