
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం రికార్డు స్థాయిలో 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ రోజు కరోనాతో ముగ్గురు మరణించగా.. మొత్తం మృతులు సంఖ్య 198గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3,352 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,976 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒక్కరోజే ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 329, రంగారెడ్డి జిల్లాలో 129 ఉన్నాయి.
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసులు :