
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి: సీపీఎం
వరంగల్: ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లా కమిటీ వరంగల్ లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలుకు పోరుబాట పట్టినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ప్రేవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోస్టర్ విడుదల చేశారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ రంగాన్ని కాపాడలన్నారు.