
మాట్లాడుతున్న చాడ వెంకట్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెరుపుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని మార్కండేయ భవనంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల స్థాయి సమావేశం ఆదివారం జరగగా.. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలోని పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. రాజ్యాన్ని ఏలుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులను సమర్థించడం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లే అన్నారు. మోదీ పాలనలో సంఘపరివార్ శక్తులు రాజ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని, సామాన్యులు దినదిన గండంగా బతుకులు వెళ్లదీస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకే సీపీఐ పని చేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు అట్రాసిటీ కేసుపై ఇచ్చిన జడ్జిమెంటుతో దళితులు, గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందన్నారు. వెంటనే అట్రాసిటీ కేసును పూర్వపు నిబంధనలతో అమలయ్యేలా పార్లమెంటు ప్రకటన చేయాలని అన్నా రు.
ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి కేవలం తన ఇం ట్లోవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ల క్షా13వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఏపీలో మాదిరిగా భృతి ని అందంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులను ఎమ్మెల్యేల చేతుల్లో పెడితే ఎవరికి న్యా యం జరుగుతుందని ప్రశ్నించారు. 20 నెలలుగా సచివాలయానికి రాకుండా ఉంటూ నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రో జులు దగ్గర పడ్డాయన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలో కార్యకర్తలు ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు సామల మల్లేశం, గుంటి వే ణు, మిద్దె నర్సన్న, బూర శ్రీనివాస్, పోలు కొమురయ్య, ఎలిగేటి రాజశేఖర్, సుద్దాల రాజు, బందనకల్ రాజు, గోపన్నగారి ప్రభాకర్, వెంకన్న, కనకయ్య, సత్తవ్వ, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment