బాలికపై సీఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నం: అరెస్ట్ | crpf officer raped minor girl | Sakshi
Sakshi News home page

బాలికపై సీఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నం: అరెస్ట్

Published Tue, Dec 30 2014 9:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బాలికపై సీఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నం: అరెస్ట్ - Sakshi

బాలికపై సీఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నం: అరెస్ట్

హైదరాబాద్: నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక(14)పై సీఆర్పీఎఫ్ అధికారి అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటన తాజాగా వెలుగుచూసింది.  ముఖేష్ గోద్రా అనే సీఆర్పీఎఫ్ అధికారి బాలికపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.

తనపై ఆ అధికారి అత్యాచారం చేయడానికి యత్నించినట్లు ఆ బాలిక చాంద్రాయణ గుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసింది.  దీంతో ఆ అధికార్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు  విచారణ చేపట్టారు.  హైదరాబాద్ పాతబస్తీలో  సీఆర్పీఎఫ్ క్యాంపులో  ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈనెల 27వ తేదీన ఆ బాలిక పనినిమిత్తం అక్కడి వెళ్లగా..  ఆ ఆర్మీ అధికారి తనను లైంగికంగా వేధించడాని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement