నాడు తప్పని.. నేడు అదే చేస్తున్నారు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం అప్రజాస్వామికమని తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడాన్ని తప్పుబట్టిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇప్పడు అదే తప్పు చేస్తున్నారని డీఎస్ విమర్శించారు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని డీఎస్ తెలిపారు. ఫిరాయింపుల నిరేధక చట్టం అమల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని కేసు నీరుగార్చే ప్రయత్నం చేయకూడదని పేర్కొన్నారు. ఛైర్మన్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారనే నమ్మకముందని, అనర్హత పిటిషన్ విచారణను జాప్యం చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.