సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం సవరించిన సమగ్ర రికార్డులను ‘మీసేవ’లో అందుబాటులో ఉంచుతున్నట్టు ధరణి ప్రత్యేకాధికారి రజత్‌కుమార్ సైనీ తెలిపారు. ‘మా భూమి ఏమైపోయిందో’ శీర్షికన రాష్ట్రంలోని భూ రికార్డులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో రికార్డుల్లో తమ భూమి ఎవరి పేరు మీద ఉందోననే ఆందోళనలో రైతాంగం ఉందని ‘సాక్షి’ ఈ నెల 23న కథనాన్ని ప్రచురించింది.
స్పందించిన అధికారులు సమగ్ర భూ రికార్డుల వివరాలను మీసేవ కేంద్రాల్లోకి అందుబాటులో కి తెచ్చారు. మీసేవలో నిర్దేశిత ఫీజు చెల్లించి పహాణి, ఆర్‌వోఆర్1–బీ రికార్డులను తీసుకోవచ్చని రజత్‌కుమార్ చెప్పారు. సవరించిన రికార్డులన్నింటినీ పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులో కి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుం దని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణ పరిశీలన దశలో ఉందని, పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment