సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గణాంకాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలను భర్తీ చేసింది. పోలీసు శాఖలో అత్యధికంగా 12,152 పోస్టులను భర్తీ చేసింది. టీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వెల్లడించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ మేరకు మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువైన 2014, జూన్ 2 నుంచి 2018, ఆగస్టు 31 వరకు పోస్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అన్ని శాఖల్లో కలిపి 1,28,274 పోస్టుల ఖాళీలను గుర్తించారు. వీటిలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు నియామక మండలి, గురుకుల విద్యాలయాల నియామక మండలి, ఆయా శాఖల ఎంపిక కమిటీలు.. 87,346 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఇలా నోటిఫికేషన్ జారీ చేసిన వాటిలో 24,476 పోస్టులు భర్తీ అయ్యాయి. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణలో 128 పోస్టులను భర్తీ చేశారు. సింగరేణిలో 8,205 పోస్టులు భర్తీ అయ్యాయి. వివిధ శాఖలో రెగ్యులర్‌గా మార్చినవి.. 811 పోస్టులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
Published Wed, Oct 3 2018 1:53 AM | Last Updated on Wed, Oct 3 2018 1:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment