
అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యం
తెలంగాణలో మరో పార్టీ జెండా ఎగరదు
ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే నడుస్తున్నరు
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి : తెలంగాణ సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మడమతిప్పని పోరాటం చేసి, రాజకీయ పార్టీగా ఎది గి రాజ్యాధికారాన్ని సాధించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇన్నేళ్లుగా నష్టపోయిన తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నా యకత్వంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి లో శనివారం టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే టార్గెట్‌ను దాటి సభ్యత్వాలు కొనసాగుతున్నాయన్నారు.
అనంతరం గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల ఎన్నికలు నిర్వహించుకుని ఏప్రిల్ 27న పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తి చెందుతూ పార్టీ సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు జరుగుతున్నాయని, మొక్కల పెంపకం వల్ల వర్షాలు కురుస్తాయన్నారు. పాలీహౌస్ పథకానికి రూ. 250 కోట్లు కేటాయించామని, దీన్ని రైతులు విని యోగించుకోవాలన్నారు. అలాగే డ్రిప్ పథకాన్నీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామం లో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.
కార్యకర్తలకు తగిన గుర్తింపు
పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు టీఆర్‌ఎస్‌తోనే తీరుతాయన్న నమ్మకంతోనే అధికారం ఇచ్చారని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ విజయం సాధించారని పేర్కొన్నారు. అందుకే సభ్యత్వ నమోదులో అన్ని వర్గాల ప్రజలు ఉత్సహాంగా పాల్గొంటున్నారని తెలిపారు. పలు సంక్షేమ పథకాలతో ప్రజాశ్రేయస్సుకు పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, టీఆర్‌ఎస్ నాయకులు తిర్మల్‌రెడ్డి, పున్న రాజేశ్వర్, నిట్టు వేణుగోపాల్‌రావు, ఎంపీపీ మంగమ్మ, వైస్ ఎంపీపీ క్రిష్ణాజీరావు, సర్పంచ్‌రామాగౌడ్, ఎంపీటీసీ గంగాధర్‌రావు, విండో వైస్‌చైర్మన్ నాగభూషణం, నాయకుడు గోపిగౌడ్, కమ్మరి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మారెడ్డి, గైని శ్రీనివాస్‌గౌడ్, పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్‌రావు, రాంరెడ్డి, రమేశ్‌గుప్తా, చంద్రశేకర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు నందరమేశ్, మధుసుదన్‌రావు, తదితరులు ఉన్నారు.