వడదెబ్బతో గురువారం వేర్వేరుచోట్ల ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మం డలం అమ్మగూడెంకు చెందిన పసుపులేటి వెంకయ్య(75), మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివ్వాయపల్లికి చెం దిన వడ్ల నారాయణ, రంగారెడ్డి జిల్లా గండేడ్ మండలం దేశాయిపల్లికి చెందిన గాజుల రాములు (52), నల్లగొండ జిల్లా చివ్వెం లకు చెందిన సోపంగి దుర్గయ్య (45), రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల భిక్షపతి, చిలుకూరు మండలం దూదియా తండా వాసి గుగులోతు బాసు ఉన్నారు.