సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. 39,778 మంది పరీక్ష రాయగా... 32,973 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే, పాఠశాల విద్య కమిషనర్ ఆమోదం పొందని 14 మైనారిటీ, 52 కొత్త డీఎడ్ కళాశాలలకు చెందిన 3,875 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం www.bseap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.