సాక్షి, హైదరాబాద్: ఉత్పత్తుల విక్రయాల విషయంలో తూకంలో తేడాలు రావొద్దని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో విత్తన కంపెనీల ప్రతినిధులు సోమ వారం అకున్ సబర్వాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ పలు విజ్ఞప్తులు చేశారు.
అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని, తూకంలో తేడా లేకుండా, రైతాంగానికి నష్టం కలగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన తూకం కంటే తక్కువ పరిమాణంలో విక్రయిస్తే రైతుల కు నష్టం చేసిన వారవుతారని, ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలపై సీనియర్ ఆఫీసర్లను పంపి ఉత్పత్తిదారులకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక తప్పుల విషయంలో కేసులు నమోదు చేసే విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment