ఖమ్మం జెడ్పీసెంటర్: కలెక్టరేట్‌లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దని అధికారులను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఆదేశించారు. ఆయన శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఆయువుపట్టరుున కలెక్టరేట్‌లోనే ఫైల్స్ ఆగితే పాలన కుంటుపడుతుందన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఫైలును వెంటనే క్లియర్ చేయూలన్నారు.
సమస్యాత్మక ఫైల్స్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలన్నారు. వారంలో రెండు సార్లు సమావేశం నిర్వహిస్తానని, పెండింగ్ ఫైల్ కనిపించవద్దని అన్నారు. ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలన కోసం ఐటీడీఏకి పంపాలన్నారు. ఏ ఫైల్ ఎక్కడుంది... ఎక్కడాగింది అనే విషయం తెలుసుకునేందుకు స్పెషల్ సాఫ్ట్‌వేర్ రూపొందించి వెంటనే అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మస్తాన్‌రావు, చంద్రశేఖర్, మదన్‌గోపాల్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో పెండింగ్ ఫైళ్లు ఉంచొద్దు:కలెక్టర్
Published Sun, Dec 28 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM
Advertisement