
ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: పేదలకు 3లక్షల 50వేల రూపాయల ఖర్చుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో గృహనిర్మాణ శాఖ పరిస్థితిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 8లక్షల ఇళ్ల నిర్మాణం పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు.
సీఐడీ విచారణ పూర్తి అయిన తరువాత పెండింగ్ ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
**