
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే పోలీసు శాఖను ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతుండగా, మరోవైపు అనారోగ్యంతో సిబ్బంది మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో పోలీస్ అధికారి గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర కులకర్ణి ఇవాళ ఉదయం మరణించారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం 1995 బ్యాచ్‌కు చెందిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.